Sonia Gandhi: ఈడీ ఎదుట హాజరైన సోనియా.. ఆ బృందంలో ఓ మహిళా అధికారి

by GSrikanth |   ( Updated:2022-07-21 07:15:40.0  )
Sonia Gandhi Arrives at ED Office for questioning
X

దిశ, వెబ్‌డెస్క్: Sonia Gandhi Arrives at ED Office for questioning| ఢిల్లీలోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచార‌ణ‌కు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ హాజ‌రయ్యారు. కాంగ్రెస్ పార్టీ సొంత‌ ప‌త్రిక నేష‌న‌ల్ హెరాల్డ్ ఆస్తుల వ్యవ‌హారానికి సంబంధించిన కేసులో త‌మ ముందు విచార‌ణ‌కు హాజ‌రుకావాలంటూ ఈడీ అధికారులు సోనియాకు స‌మ‌న్లు జారీ చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ మేర‌కు ఇవాళ ఉదయం 11 గంట‌ల‌కు ఆమె ఈడీ కార్యాల‌యానికి చేరుకున్నారు. ఐదుగురు అధికారులతో కూడిన బృందం సోనియా గాంధీని ప్రశ్నిస్తున్నారు. సోనియాను ప్రశ్నిస్తున్న ఐదుగురు అధికారుల బృందంలో ఓ మహిళా అధికారి కూడా ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, మరోపక్క సోనియా గాంధీ ఈడీ విచారణను వ్యతిరేకిస్తూ దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనలు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: 'అలాంటి వ్యక్తులను ఇంజినీర్ అని పిలవలేరు'

Advertisement

Next Story