ధరణిలో ఎన్నో తప్పులు.. 26 గుంటల భూమికి 8 ఎకరాల ప్రభుత్వ భూమి

by Javid Pasha |
ధరణిలో ఎన్నో తప్పులు.. 26 గుంటల భూమికి 8 ఎకరాల ప్రభుత్వ భూమి
X

దిశ, రాజంపేట: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ శాఖలో సిబ్బంది వల్ల తప్పులు జరుగుతున్నాయని ధరణి పోర్టల్‌ని ఏర్పాటు చేసింది. తద్వారా రికార్డులను దానిలో అనువదించు ప్రతి ఒకటి ఆన్లైన్ చేసే విధంగా చేశారు. సిబ్బంది వల్ల తప్పు జరిగితే అతనిపై చర్య తీసుకుంటారు, కానీ ఏకంగా ధరణి వెబ్ సైట్‌లోనే తప్పులు జరుగుతున్నాయి. దీనికి నిదర్శనం రాజంపేట మండలంలోని పొందుర్తి గ్రామంలో కమ్మరి దశరథం చారి అనే వ్యక్తికి 26 గుంటల పట్టా భూమి ఉంది.

ఈ రికార్డు ప్రకారం గత 20 సంవత్సరాల నుండి అతని పేరుపై 26 గుంటల భూమి పట్టా పాస్ బుక్ ఉంది. కానీ ధరణిలో మాత్రం ఏకంగా 8 ఎకరాల ఆసైన్‌డ్ భూమిగా రికార్డులోకి వచ్చింది. కొంత మంది అధికారుల తప్పిదం వల్ల ఇలా వెన్ యు రికార్డ్ ధరణిలో అప్లోడ్ చేసే సమయంలో ఇలా తప్పులు రికార్డ్‌లోకి వచ్చాయి. రోజురోజుకు మండలంలోని ధరణిలో తప్పులు బయట పడుతున్నాయి.

గ్రామాల్లో ఒకరి పేరు పైన ఉన్న భూమి ఇంకొకరి పేరు పైకి మార్చడానికి ఎన్నో షరతులు పెట్టే అధికారులు ఇలాంటి తప్పులు చేస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా, మండల రెవెన్యూ అధికారులు మేల్కొని ఇలాంటి తప్పులను మార్పులు చేయాలని మండల ప్రజలు కోరుతున్నారు.



Advertisement

Next Story

Most Viewed