- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Bangladesh: యూనస్ కు వ్యతిరేకంగా తిరుగుబాటు..!

దిశ, నేషనల్ బ్యూరో: బంగ్లాదేశ్ ప్రధానిగా షేక్ హసీనా రాజీనామా చేసిన తర్వాత అక్కడ రాజకీయ అనిశ్చితి నెలకొంది. కాగా.. ప్రస్తుతం అక్కడ మహమ్మద్ యూనస్ (Muhammad Yunus) నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం కొలువుదీరింది. ప్రస్తుతం ఆయనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చెలరేగే అవకాశముంది. దీంతో అక్కడి ఆర్మీ వర్గాలు అత్యవసర సమావేశం నిర్వహించినట్లు సమాచారం. ఈమేరకు స్థానిక మీడియాల్లో కథనాలు వస్తున్నాయి. బంగ్లా ఆర్మీ చీఫ్ జనరల్ వకార్- ఉజ్- జమాన్ (Waker-Uz-Zaman) నేతృత్వంలో ఈ అత్యవసర సమావేశం జరిగింది. ఇందులో ఐదుగురు లెఫ్టినెంట్ జనరల్స్, ఎనిమిది మంది మేజర్ జనరల్స్‌తో సహా ఇతర ముఖ్య అధికారులు పాల్గొన్నారు. యూనస్ బాధ్యతలు చేపట్టినప్పటినుంచి బంగ్లా ప్రజల్లో అశాంతి, అపనమ్మకం పెరిగిందని ఆర్మీ వర్గాలు తెలిపాయి. దీనివల్ల రాబోయే రోజుల్లో తీవ్ర పరిణామాలు ఎదురయ్యే అవకాశం ఉందని వెల్లడించాయి. ఈ క్రమంలో దేశంలో స్థిరత్వాన్ని పునరుద్ధరించడంలో ఆర్మీ పాత్ర ఎక్కువగా ఉంటుందనే దానిపై అధికారులు చర్చించారు. అత్యవసర పరిస్థితిని ప్రకటించాలని లేదా యూనస్‌పై తిరుగుబాటు చేయాలని సైన్యం యూనస్ పై ఒత్తిడి తీసుకురావచ్చని సంబంధిత వర్గాలు సూచించాయి. అంతేకాక.. సైన్యం పర్యవేక్షణలోనే జాతీయ ఐక్యత ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయాలని యోచిస్తుంది. ఇటీవల కాలంలో వివిధ రాజకీయ పార్టీలు, విద్యార్థి నాయకులు సైన్యంపై నిరసన గళం లేవనెత్తారు. ఈ నిరసనకారులను నియంత్రించడానికి ఒక ప్రణాళికను రూపొందించడానికి రెడీ అయ్యింది. దీంతో దేశంలోని సైన్యం అలెర్ట్ అయ్యింది. ఢాకా అంతటా కట్టుదిట్టమైన గస్తీని ఏర్పాటుచేయడంతో పాటు పలు ప్రాంతాల్లో చెక్‌పోస్ట్‌లు పెట్టింది. ఇక, హసీనాకు చెందిన అవామీ లీగ్ పార్టీ తిరిగి పుంజుకునేలా చేసేందుకు సైన్యం ఒక ప్రణాళికను రూపొందిస్తుందని విద్యార్థి పార్టీలు ఆరోపించాయి. అయితే, వీటిని సైన్యం ఖండించింది.
యూనస్ చైనా పర్యటన..
మరోవైపు, ఈ రాజకీయ గందరగోళం నేపథ్యంలో యూనస్ త్వరలోనే చైనాలో పర్యటించనున్నారు. చైనా- బంగ్లాల మధ్య సంబంధాల్లో మార్పునకు ఈ పర్యటన దోహదపడుతుందని ఢాకా అధికారులు భావిస్తున్నారు. కాగా.. ఈ పర్యటనను ఢాకా పొరుగు దేశాలను నిశితంగా పరిశీలిస్తున్నాయి. ఇకపోతే, రిజర్వేషన్ల వ్యతిరేక నిరసనల్లో పెద్దఎత్తున హింస చెలరేగిన నేపథ్యంలో గతేడాది ఆగస్టులో హసీనా (Sheikh Hasina) దేశం విడిచి పారిపోయారు. అప్పట్నుంచి ఆమె భారత్ లోనే తలదాచుకుంటున్నారు.