- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Bigg Boss Telugu 8: ‘అతడు హస్బెండ్ మెటీరియల్’.. లేడీ కంటెస్టెంట్ ఆసక్తికర వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న తెలుగు బిగ్‌బాస్ సీజన్ -8 హోరాహోరీగా సాగుతోంది. కొంతమంది ఎలిమినేట్ అవ్వగా.. మరికొంతమంది వైల్డ్ కార్డు ఎంట్రీలు ఇచ్చారు. ప్రస్తుతం రెండు టీమ్‌లుగా హౌస్ లో ఫుల్ ఫన్ అండ్ సీరియస్ టాస్కులతో ప్రేక్షకుల్ని ఫుల్ ఎంటర్‌టైన్ చేస్తున్నారు. ఇకపోతే ఈ వారం సీత ఎలిమినేట్ అయి ఇంటికెళ్లింది. పృథ్వీ, యష్మి, గంగవ్వ, విష్ణు ప్రియ, మెహబూబ్ కూడా సీతతో పాటు నామినేషన్స్ లో ఉన్నారు. కానీ చివరకు మోహబూబ్ అండ్ సీత మిగిలిపోయారు. ఇక బిగ్ బాస్ కిర్రాక్ సీతను ఎలిమినేట్ చేశారు. వెళ్తూ వెళ్తూ సీత హౌస్‌మేట్స్‌పై పలు ఆసక్తికర కామెంట్లు చేసింది. మెహబూబ్ విన్నర్ కావాలని సీత తెలిపింది.
టైటిల్ విన్నర్ కావాలని కోరింది. దీంతో మెహబూబ్ ఎమోషనల్ అయ్యాడు. అంతేకాకుండా నిఖిల్ హస్బండ్ మెటీరియల్ అని వెల్లడించింది. సీత ఎలిమినేట్ అవ్వడంతో విష్ణుప్రియ కూడా చాలా ఫీల్ అయ్యింది. మూడు వైట్ హార్ట్స్ అండ్ మూడు బ్లాక్ హార్ట్స్ ను హౌస్ లో ఉన్న కంటెస్టెంట్లకు ఇచ్చింది. విష్ణు ప్రియ, ముక్కు అవినాశ్, నబిల్ కు వైట్ హార్ట్ ను అందించగా.. నిఖిల్, గౌతమ్, నయని లకు బ్లాక్ హార్ట్ ఇచ్చింది. అలాగే వీరికి సీత పలు సలహాలు కూడా ఇచ్చింది. సీత చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్ కావడంతో అభిమానులు నిరాశకు గురవుతున్నారు. సీత స్ట్రాంగ్ కంటెస్టెంట్ అన్న విషయాన్ని నాగార్జున స్వయంగా తన నోటితో చెప్పిన విషయం తెలిసిందే.