బోధన్ పట్టణంలో శివాజీ విగ్రహ వివాదం.. రాళ్లు రువ్వుకున్న ఆందోళకారులు

by Manoj |   ( Updated:2022-03-20 11:14:41.0  )
బోధన్ పట్టణంలో శివాజీ విగ్రహ వివాదం.. రాళ్లు రువ్వుకున్న ఆందోళకారులు
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: బోధన్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో చత్రపతి శివాజీ విగ్రహ ఏర్పాటు వివాదాస్పదమైంది. ఆదివారం ఉదయం రెండు వర్గాల మధ్య ప్రారంభమైన బలప్రదర్శన పోలీస్ స్టేషన్ ఫిర్యాదుకు వెళ్ళింది. అక్కడ అ రెండు వర్గాలను సముధా‌యిన్చేందుకు పోలీసులు చేసిన ప్రయత్నం విఫలమయ్యాయి ఆందోళనకారులు ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు లాఠీలకు పని చెప్పారు.

అయినప్పటికీ ఆందోళనకారులు వెనక్కి తగ్గకపోవడంతో టియర్ గ్యాస్ ప్రయోగించి వారిని చెల్లాచెదురు చేశారు. బోధన్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో శివాజీ విగ్రహం ఏర్పాటు స్థలాన్ని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కె ఆర్ నాగరాజు, జెసి చంద్రశేఖర్ పరిశీలించారు. బోధన్ పట్టణంలో 144 సెక్షన్ అమల్లోకి వచ్చినట్లు ప్రకటించారు. బోధన్‌లో శివాజీ విగ్రహం ఏర్పాటు వివాదాస్పదం అయిన నేపథ్యంలో దాన్ని అక్కడ నుంచి తొలగించాలని ప్రయత్నిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని నిజాంబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ హెచ్చరించారు. ఈ మేరకు వీడియోను విడుదల చేశారు. అంబేద్కర్ చౌరస్తాలో శివాజీ విగ్రహం ఏర్పాటు మున్సిపాలిటీ నుంచి అనుమతి తీసుకున్న స్థానిక అధికార పార్టీ ఎమ్మెల్యే, మజ్లిస్ నాయకులు అడ్డుకుంటున్నారని అన్నారు. జాతీయ వీరుడి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే తప్పేంటని ప్రశ్నించారు.



Advertisement

Next Story