ఆ వ్యాధితో అంతా మర్చిపోయా.. కనీసం హాస్పిటల్‌కు కూడా తీసుకెళ్లలేదు.. స్టార్ హీరోయిన్ ఎమోషనల్ కామెంట్స్

by Kavitha |   ( Updated:2024-10-18 14:26:02.0  )
ఆ వ్యాధితో అంతా మర్చిపోయా.. కనీసం హాస్పిటల్‌కు కూడా తీసుకెళ్లలేదు..  స్టార్ హీరోయిన్ ఎమోషనల్ కామెంట్స్
X

దిశ, సినిమా: స్టార్ హీరోయిన్ సమంత(samantha) అందరికీ సుపరిచితమే. తన అందం, అభినయంతో అందరినీ ఆకట్టుకుంటుంది. ఇక ‘ఏమాయ చేసావే’(Ye Maya Chesave) సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. వరుస సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్ రేంజ్‌కు దూసుకుపోయింది. అయితే గతేడాది మయోసైటీస్(Myositis) అనే వ్యాధి బారిన పడడంతో సినిమాలకు బ్రేక్ ఇచ్చి.. హెల్త్ పై ఫోకస్ పెట్టింది. కాగా ప్రస్తుతం ‘సిటాడెల్: హనీ బన్నీ’(Citadel: Honey Bunny) అనే వెబ్ సిరీస్‌తో మన ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నది. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్లలో ఈ ముద్దుగుమ్మ బిజీ బిజీగా ఉన్నది.

తాజాగా సిటాడెల్ సిరీస్ ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సమంత షాకింగ్ కామెంట్స్ చేసింది. ఆమె మాట్లాడుతూ.. “మయోసైటీస్ వచ్చిన టైంలో నేను ఒక్కసారిగా అంతా మర్చిపోయా. మతిమరుపు వచ్చినట్టు అయి చాలా ఇబ్బంది పడ్డాను. నన్ను ఎవరూ హాస్పిటల్‌కు తీసుకెళ్లలేదు. అలాగే నా హెల్త్ గురించి కూడా అప్పుడు ఎవరూ అడగలేదని ఇప్పుడు అనుకుంటాని సమంత షాకింగ్ కామెంట్స్ చేసింది. అలాగే తాను సెట్స్ పైకి వచ్చే వరకు నిర్మాతలు వెయిట్ చేసినందుకు కృతజ్ఞురాలినై ఉంటాను" అని ఎమోషనల్ అయింది. ప్రస్తుతం ఈ బ్యూటీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


👉Also Read : Samantha:‘సాయం చేసిన వారిని ఎప్పుడు గుర్తుంచుకోవాలి’ .. స్టార్ హీరోయిన్ సంచలన కామెంట్స్

Advertisement

Next Story

Most Viewed