- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Sambhal violence:సంభాల్ హింసపై సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలి- ప్రియాంక గాంధీ
దిశ, నేషనల్ బ్యూరో: ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్‌లో(Sambhal violence) చెలరేగిన హింసపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, వయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా(Priyanka Gandhi) స్పందించారు. ఈకేసుని సుప్రీంకోర్టు(Supreme Court) పరిగణలోకి తీసుకోవాలని కోరారు. “సంభాల్ లో చెలరేగిన హింస దురదృష్టకరం. ఇంత సున్నితమైన విషయంలో ఇరుపక్షాల వాదనలు వినకుండా, ఎలాంటి విచారణ లేకుండానే అధికారులు హడావుడిగా చర్యలు చేపట్టారు. అవసరమైన విధివిధానాలు పరిగణించకుండా సామరస్య వాతావరణాన్ని ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) ప్రభుత్వమే చెడగొట్టింది. అధికారంలో ఉన్నప్పుడు ఏ ప్రభుత్వానికైనా వివక్ష, అణచివేత, విభజన వ్యాప్తి తగదు. దాని వల్ల ప్రజలకు, దేశానికి ఎలాంటి ప్రయోజనం ఉండదు. సుప్రీం కోర్టు సంభాల్ ఘటనను పరిగణలోకి తీసుకుని, న్యాయం చేయాలి. ఎట్టిపరిస్థితుల్లోనూ శాంతి భద్రతలను కాపాడాలన్నదే ప్రజలకు నా విజ్ఞప్తి” అని ప్రియాంకాగాంధీ సోషల్ మీడియాలో రాసుకొచ్చారు.
సంభాల్ లో ఘర్షణ
సంభాల్‌లోని మొగల్ కాలానికి చెందిన జామా మసీదు ఉన్న చోట గతంలో హరిహర మందిరం ఉండేదన్న పిటిషను మేరకు స్థానిక న్యాయస్థానం సర్వేకు ఆదేశాలు ఇచ్చింది. జామా మసీదు సర్వేను అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో హింస చెలరేగింది. సర్వేను వ్యతిరేకిస్తున్న నిరసనకారులు పోలీసులతో హింసాత్మక ఘర్షణకు పాల్పడ్డారు. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా, 20 మంది భద్రతా సిబ్బంది సహా పలువురు గాయపడ్డారు. ఈ ఘటన అనంతరం జిల్లాలో 12వ తరగతి వరకు పాఠశాలలను మూసివేయాలని అధికారులు ఆదేశించారు. దీంతో పాటు ఇంటర్నెట్‌పై నిషేధం విధించారు. అలాగే నవంబర్ 30 వరకు బయటి వ్యక్తులు జిల్లాలోకి రాకుండా జిల్లా యంత్రాంగం నిషేధం విధించింది.