Ajith Kumar: ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ ట్రైలర్ విడుదల.. పవర్ ఫుల్ లుక్‌తో అదరగొట్టిన స్టార్ హీరో

by Hamsa |
Ajith Kumar: ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ ట్రైలర్ విడుదల.. పవర్ ఫుల్ లుక్‌తో అదరగొట్టిన స్టార్ హీరో
X

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్(Ajith Kumar) అందరికీ సుపరిచితమే. ‘తునివ్’ తర్వాత ఏడాది పాటు సినిమాలకు దూరంగా ఉన్న ఆయన మళ్లీ బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్ చేస్తూ ఫుల్ బిజీ అయిపోయారు. ఇటీవల ‘విదాముయార్చి’వచ్చి ప్రేక్షకులను అలరించారు. కానీ బ్లాక్ బస్టర్ హిట్ మాత్రం సాధించలేకపోయారు. ఈ సినిమా విడుదలైన తర్వాత బాక్సాఫీసు వద్ద పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం అజిత్ కుమార్ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’(Good Bad Ugly) మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అధిక్ రవిచంద్రన్(Adhik Ravichandran) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers)నిర్మిస్తున్నారు.

అయితే ఈ చిత్రంలో అజిత్ సరసన స్టార్ బ్యూటీ త్రిష హీరోయిన్‌గా నటిస్తోంది. ఇందులో అర్జున్ దాస్, ప్రియా వారియర్, సిమ్రాన్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఏప్రిల్ 10న థియేటర్స్‌‌లో విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో మూవీ మేకర్స్ వరుస అప్డే్ట్స్ ఇస్తూ అందరిలో అంచనాలను పెంచుతున్నారు. ఇప్పటిగకే విడుదలైన పోస్టర్స్, టీజర్ అన్ని మంచి రెస్పాన్స్‌ను తెచ్చుకున్నాయి. తాజాగా, ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ తెలుగు ట్రైలర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్, ఇక ఇందులో అజిత్ పవర్ ఫుల్ లుక్‌లో మాస్ డైలాగ్స్ చెప్పి అందరినీ ఫిదా అయ్యేలా చేశారు. అయితే ఇందులో యాక్షన్స్ సీన్స్ ప్రేక్షకుల్లో గూస్ బంప్స్‌ను తెప్పిస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఏకే వస్తున్నాడు దారి వదలండి.. భయాన్నే భయపెట్టేవాడు అని చెప్పే డైలాగ్స్ పవర్ ఫుల్‌గా ఉన్నాయి.



Next Story

Most Viewed