- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
PM Modi: ప్రధాని మోడీతో ఫోన్‌లో మాట్లాడిన ఇజ్రాయెల్, జపాన్ ప్రధానులు

దిశ, నేషనల్ బ్యూరో: ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు గురువారం భారత ప్రధాని నరేంద్ర మోడీతో ఫోన్‌లో మాట్లాడారు. మంగళవారం జమ్మూకశ్మీర్‌లోని పెహల్‌గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ విషాద సమయంలో భారత ప్రజలకు తమ మద్దతు ఉంటుందని, అనాగరికంగా జరిగిన దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు సానుభూతి వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ప్రజలు, బాధిత కుటుంబాలకు సంఘీభావం తెలిపారు. ఉగ్రదాడి విషయంలో భారత్‌కు పూర్తి మద్దతు ఇస్తానని హామీ ఇచ్చారు. ఈ విషయాన్ని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీ జైశ్వాల్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఈ దారుణం గురించి ప్రధాని మోడీ నెతన్యాహుకు వివరించారని, దాడికి కారకులైన వారిని, వారికి మద్దతిచ్చే వారిని శిక్షించడానికి భారత్ సిద్ధంగా ఉన్నట్టు చెప్పారన్నారు. అంతకుముందు ఇజ్రాయెల్ రాయబారి రూవెన్ అజార్ పెహల్‌గామ్ దాడిని 2023, అక్టోబర్ 7 హమాస్ దాడితో పోల్చారు. పౌరులను లక్ష్యంగా చేసుకోవడం, తీవ్రవాద గ్రూపుల మధ్య పెరుగుతున్న సమన్వయానికి హెచ్చరిక అని అన్నారు. జపాన్ దేశ ప్రధాని షిగేరు ఇషిబా కూడా గురువారం ప్రధాని మోడీకి ఫోన్ చేసి ఉగ్రవాద దాడిలో సామాన్యులు ప్రాణాలు కోల్పోవడంపై ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఉగ్రవాదం మొత్తం మానవాళికే పెనుముప్పు. ప్రజాస్వామ్యవాదులు ఉగ్రవాదంపై పోరులో ఏకతాటిపైకి రావాలని పేర్కొన్నారు.