Ram Charan: ‘పెద్ది’ సినిమా గ్లింప్స్‌పై అల్లు శిరీష్ రియాక్షన్ ఇదే.. వైరల్ అవుతున్న ట్వీట్

by Hamsa |   ( Updated:2025-04-08 14:46:16.0  )
Ram Charan: ‘పెద్ది’ సినిమా గ్లింప్స్‌పై అల్లు శిరీష్ రియాక్షన్ ఇదే.. వైరల్ అవుతున్న ట్వీట్
X

దిశ, సినిమా: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan), బుచ్చిబాబు కాంబినేషన్‌లో రాబోతున్న లేటెస్ట్ మూవీ ‘పెద్ది’. ఇందులో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్(Janvi Kapoor) హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే రామ్ చరణ్ 16వ మూవీగా రాబోతున్న ఈ సినిమాను వ్రిద్ది సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్‌పై నిర్మిస్తున్నారు. ఇందులో జగపతి బాబు, కన్నడ స్టార్ శివరాజ్ కుమార్(Shivaraj Kumar), దివ్యేందు శర్మ వంటి నటులు కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ అంచనాలను పెంచేసిన సంగతి తెలిసిందే. ఇక శ్రీరామ నవమి పండుగ సందర్భంగా వచ్చిన ఫస్ట్ షాట్ గ్లింప్స్ మాత్రం ఊహించని విధంగా ఉండటంతో ప్రేక్షకులను ఫిదా చేయడంతో పాటు పలువురు సినీ ప్రముఖులకు కూడా నచ్చాయి.

ఇక ఇందులోని రామ్ చరణ్ డైలాగ్స్ క్రికెట్ ఆడటం అందరినీ ఆశ్చర్యపరిచాయి. దీంతో ఈ గ్లింప్స్‌పై కొంతమంది హీరో,హీరోయిన్లు కూడా సోషల్ మీడియా ద్వారా తమ అభిప్రాయాలను తెలియజేశారు. ఈ నేపథ్యంలో.. తాజాగా, అల్లు శిరీష్ ట్విట్టర్ ద్వారా రియాక్ట్ అయ్యారు. ‘‘పెద్ది గ్లింప్స్ మామూలుగా లేదుగా.. హ్యాపీ శ్రీరామ నవమి’’ అని రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతుండగా.. నెటిజన్లు మాత్రం రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఈ ట్వీట్‌తో సోషల్ మీడియాలో కొత్త చర్చ మొదలైంది. ఇటీవల రామ్ చరణ్ బర్త్ డేకు సినీ సెలబ్రిటీలంతా విష్ చేశారు కానీ అల్లు అర్జున్ పోస్ట్ పెట్టలేదని వీరి మధ్య వివాదం కొనసాగుతున్నట్లు అంతా అనుకుంటున్నారు.



Next Story

Most Viewed