హైదరాబాద్‌లో డీలిమిటేషన్ పై రౌండ్ టేబుల్ సెమినార్.. కోదండరామ్ కీలక వ్యాఖ్యలు

by Mahesh |
హైదరాబాద్‌లో డీలిమిటేషన్ పై రౌండ్ టేబుల్ సెమినార్.. కోదండరామ్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: గత కొంత కాలంగా కేంద్ర ప్రభుత్వం డీలిమిటేషన్ (Delimitation) చేసి సౌత్ రాష్ట్రాలకు అన్యాయం చేయాలని చూస్తోందని తమిళనాడు సీఎం స్టాలిన్ (Tamil Nadu CM Stalin) ఆరోపిస్తున్నారు. ఇందులో భాగంగా సౌత్ రాష్ట్రాల (South States) ముఖ్యమంత్రులతో ఆయన మీటింగ్ కూడా ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అలాగే పలువురు నేతలు కేంద్ర మంత్రులను సైతం కలిసి.. డీలిమిటేషన్ (Delimitation) జనాభా ప్రాతిపదికన కాకుండా చేయాలని సౌత్ రాష్ట్రాలకు అన్యాయం జరగకుండా చూడాలని సూచించారు. కాగా ఈ డీలిమిటేషన్ వ్యవహారంపై హైదరాబాద్ లో రౌండ్ టేబుల్ సెమినార్ (Roundtable seminar in Hyderabad) నిర్వహించారు. ఈ సెమినార్‌కు ఎమ్మెల్సీ, ప్రొఫెసర్ కొదండరామ్ (Professor Kodandaram) హాజరయ్యారు.

ఈ సదర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర చేపట్టబోయే.. పార్లమెంటు నియోజకవర్గాల డీలిమిటేషన్ (Delimitation of parliamentary constituencies) పై దక్షిణాది రాష్ట్రాలకు కొన్ని అభ్యంతరాలు ఉన్నాయని అన్నారు. ఈ వ్యవహారంపై సౌత్ రాష్ట్రాల ప్రజలు (People of the Southern states) తీవ్రంగా పరిగణించాల్సి అవసరం ఉందని, లేదంటే నష్టపోయే అవకాశం ఉందని అన్నారు. పన్ను వసూళ్లలో ఉత్తరాది కంటే దక్షిణాది రాష్ట్రాలకు ఎక్కువ వాటా చెల్లిస్తున్నాయని,.. కానీ ఉత్తరాదికి ఎక్కువ నిధులు కేటాయిస్తూ.. దక్షిణ రాష్ట్రాలకు మోసం చేస్తున్నారని ఆయన గుర్తు చేశారు. ఇప్పుడు కొత్తగా డీలిమిటేషన్‌తో దక్షిణాదిలో సీట్లను తగ్గిస్తే.. తీవ్రంగా నష్టపోతమని, దీనిపై చర్చించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా ఎమ్మెల్సీ, ప్రొఫెసర్ కోదండరామ్ (Kodandaram) అన్నారు.

Next Story

Most Viewed