ఏ ఉగ్రవాదిని సమాధి చేయడానికి అనుమతివ్వొద్దు: AIIO సంచలన డిమాండ్

by srinivas |
ఏ ఉగ్రవాదిని సమాధి చేయడానికి అనుమతివ్వొద్దు: AIIO సంచలన డిమాండ్
X

దిశ, వెబ్ డెస్క్: దక్షిణ కాశ్మీర్‌ అనంత్‌నాగ్ జిల్లా పహల్గామ్‌లో ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాన్ని లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు కాల్పులు( Pahalgam terror attack) జరిపిన విషయం తెలిసిందే. ఈ కాల్పుల్లో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొంత మంది గాయాలపాలయ్యారు.

అయితే ఉగ్రవాదుల చర్యలను ఆల్ ఇండియా ఇమామ్ ఆర్గనైజేషన్(All India Imam Organization), జమియత్ ఉలేమా-ఇ-హింద్(Jamiat Ulema-e-Hind) ఖండించాయి. ఆల్ ఇండియా ఇమామ్ ఆర్గనైజేషన్ అధిపతి ఇమామ్ ఉమర్ అహ్మద్ ఇలియాసి(Imam Umer Ahmed Ilyasi) మాట్లాడుతూ భారత గడ్డపై ఏ ఉగ్రవాదిని సమాధి చేయడానికి అనుమతించకూడదని డిమాండ్ చేశారు. దేశమంతటా 5.5 లక్షలకు పైగా మసీదులు ఉన్నాయని, పహల్గామ్ దాడి బాధితుల కోసం ఇమామ్‌లు శుక్రవారం ప్రార్థనల చేస్తారని తెలిపారు. ఉగ్రవాద వ్యతిరేక సందేశాన్ని ఇస్తారని చెప్పారు. మతం పేరుతో అమాయక ప్రజలను చంపడం ఇస్లాంకు మాత్రమే కాదుని, మానవత్వానికి కూడా విరుద్ధమని ఉమర్ అహ్మద్ ఇలియాసి చెప్పారు.

ఉగ్రదాడిని మతపరమైన కోణంలో చూడటం తప్పుదారి పట్టించడమేనని జమియత్ ఉలేమా-ఇ-హింద్ తెలిపింది. ఉగ్రవాదం ఒక "క్యాన్సర్" అని, ఇది ఇస్లాం శాంతి సందేశానికి విరుద్ధమని పేర్కొంది.



Next Story

Most Viewed