- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
అఘోరీ వైద్యపరీక్షలు పూర్తి.. ఆడా, మగా..? తేల్చి చెప్పిన వైద్యులు..

దిశ,శంకర్ పల్లి : మహిళా సినీ నిర్మాతను మోసగించిన కేసులో అఘోరీని మోకిల పోలీసులు అరెస్ట్ చేశారు. అఘోరీ తో పాటు అతని భార్య శ్రీ వర్షిణితో కారులో హరిద్వార్ వెళుతుండగా మోకిలా పోలీసులు పక్కా ప్రణాళికతో ఉత్తర ప్రదేశ్ మధ్యప్రదేశ్ బార్డర్ లో మంగళవారం మధ్యాహ్నం అదుపులోకి తీసుకొని బుధవారం నార్సింగి పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చారు.
నార్సింగ్ లో రెండు గంటల పాటు విచారణ
అఘోరీ ని నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో ఏసీపీ రమణ గౌడ్ ఆధ్వర్యంలో బుధవారం రెండు గంటల పాటు విచారించారు. విచారణ అనంతరం పోలీసులు చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు.
కోర్టులో రిమాండ్
చేవెళ్ల ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం పోలీసులు చేవెళ్ల కోర్టు లో న్యాయమూర్తి ఎదుట అఘోరీని హాజరుపరిచారు. న్యాయమూర్తి అగోరిని 14 రోజుల పాటు రిమాండ్ విధిస్తూ తీర్పు ఇచ్చారు. దీంతో పోలీసులు సంగారెడ్డి జిల్లా కంది సబ్ జైలుకు తరలించారు.
అఘోరి ఆడనా.. మగనా..
కంది జైలు అధికారులు అఘోరిని ఏ బారక్ లో ఉంచాలో నిర్ధారించుకోక తిరిగి చేవెళ్ల కు తరలించారు.చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి లింగ నిర్ధారణ పరీక్షలు చేయించారు. వైద్యుల పరీక్షలో అఘోరి ట్రాన్స్ జెండర్ అని తేలడంతో తిరిగి పోలీసులు కోర్టు సూచన మేరకు నగరంలోని చంచల్గూడా జైలు కు తరలించినట్లు సమాచారం. అఘోరీ భార్య చేయవలసిన తల్లిదండ్రులతో వెళ్లేందుకు నిరాకరించడంతో పోలీసులు నగరంలోని హైదర్ షాక్ హోటల్ లోని కస్తూర్బా గాంధీ హోం కు తరలించినట్లు సమాచారం.
ఇద్దరం కలిసి ఉంటాం…
జైలులో తన భార్య శ్రీ వర్షిణి తో పాటే కలిసి ఉంటామని అఘోరీ తెలిపారు. కేసు విషయంలో పోలీసులకు పూర్తిగా సహకరిస్తున్నట్లు తెలిపారు.