- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
గ్రీవెన్స్ డే నా.. మజాకా.. కలెక్టర్ ఆదేశాలు బేఖాతర్

దిశ, ఏన్కూర్ : ఎన్ని ప్రభుత్వాలు మారిన అధికారుల పని తీరులో మార్పు రావడం లేదు అనడానికి ఏనుకూరు గ్రీవెన్స్ డే నే నిదర్శనం. ప్రజా సమస్యల పరిష్కారం కోసం జిల్లా కేంద్రానికి సుదూర ప్రాంతాల నుంచి రాకుండా ఉండటానికి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మండల కేంద్రంలోని రెవెన్యూ కార్యాలయంలో ప్రతి సోమవారం గ్రీవెన్స్ డే నిర్వహించి మండల అధికారులు పరిధిలో సమస్యను తక్షణమే పరిష్కరించే విధంగా నిర్వహిస్తారు. జిల్లా కేంద్రంలోని ఐడీఓసీలో జిల్లా కలెక్టర్ ముజాముల్ ఖాన్ గ్రీవెన్స్ డే లో కూర్చొని అర్జిదారులకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తుంటే, మండల స్థాయి అధికారులు గ్రీవెన్స్ డే కి డుమ్మా కొడుతూ ప్రజా సమస్యలను పట్టించుకోకుండా తమ పనుల్లో నిమగ్నమయ్యారు.
ప్రతివారం 20 శాఖల అధికారులు ఏనుకూరు రెవెన్యూ కార్యాలయంలో గ్రీవెన్స్ డేకి హాజరు కావాల్సి ఉండగా. ఏ రోజు కూడా పూర్తిస్థాయిలో గ్రీవెన్స్ డే కి అధికారులు హాజరు కాకపోవడం వారి పని తనానికి నిదర్శనం. 20 శాఖల అధికారులు నేడు జరిగిన గ్రీవెన్స్ డే హాజరు కావాల్సి ఉండగా విద్యాశాఖ, ఫారెస్ట్, ఆర్టీసీ, ఇరిగేషన్, ఆర్ అండ్ బి, ఉద్యానవన శాఖ, ఎక్సైజ్ శాఖల అధికారులు గైర్హాజరయ్యారు. ఈ శాఖలతో పని ఉండి గ్రీవెన్స్ లో కలిసి తమ సమస్యను పరిష్కరించుకోవచ్చు అని ఆశతో వచ్చిన అర్జీదారులు నిరాశతో వెను తిరిగి పోవాల్సిన పరిస్థితి ఉంది. ఏనుకూరులో జరిగిన గ్రీవెన్స్ డే కి 10 శాఖల అధికారులు గైర్హాజరు అవ్వడంతో జిల్లా కలెక్టర్ సార్ ఏ విధంగా చర్యలు తీసుకుంటారు వేచి చూడాలని స్థానికులు అంటున్నారు.
ఈ విషయం పై ఏన్కూర్ తహశీల్దార్ శేషగిరిరావును వివరణ కోరగా వచ్చిన అధికారుల వివరాలను, గైర్హాజరైన శాఖల అధికారుల వివరాలను జిల్లా కలెక్టరేట్ కి పంపిస్తారని అన్నారు.