- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
బీజేపీ విద్వేష రాజకీయాలకు కాంగ్రెస్ మార్క్ చెక్

భారత రాజ్యాంగం అమలులోకి వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన తరుణంలో రాజ్యాంగాన్ని పరిరక్షించుకునేందుకు పోరాడాల్సిన పరిస్థితులు దేశంలో ఏర్ప డ్డాయి. బీజేపీ రాజ్యాంగ లక్ష్యాలకు తూట్లు పొడుస్తూ, డా.బీఆర్.అంబేడ్కర్ గౌరవానికి భంగం కలిగిస్తూ నియం తృత్వ పాలన సాగిస్తోంది. సామాజిక న్యాయానికి తిలోదకాలిస్తూ ప్రమాదకరంగా పాలిస్తున్న బీజేపీకి అడ్డుకట్ట వేయాల్సిన ఆవశ్యకత ఆసన్నమైంది.
వందేళ్లకు పైగా చరిత్ర గల కాంగ్రెస్ పార్టీలోని నాయ కులు దేశం కోసం బలిదానాలు చేస్తే బీజేపీ వారిని అవమానుపరుస్తోంది. గాంధీ స్ఫూర్తితో కాంగ్రెస్ అహింసా మార్గాన్ని అనుసరిస్తుంటే బీజేపీ పాలకులు దౌర్జన్యాలు, హింసను అనుసరిస్తున్నారు. కాంగ్రెస్ జాతీయవాదం ప్రజాస్వామ్యానికి పట్టం గడితే, బీజేపీ జాతీయవాదం విద్వేషాలను రగిలిస్తోంది. మనుస్మృతిని ఆరాధించే బీజేపీ భారత రాజ్యాంగాన్ని మార్చాలని కుట్రలు పన్నుతూ బడుగు బలహీన, మైనార్టీ వర్గాలకు ఆరాధ్యమైన డా. బీఆర్ అంబేడ్కర్‌ని అవమానిస్తోంది.
ఈ వర్గాలకు సమన్యాయం చేసేందుకు..
దేశ జనాభాలో అధిక శాతం ఉన్న బడుగు బలహీన వర్గాలకు సమన్యాయం చేసేందుకు దేశవ్యాప్తంగా కుల గణన చేపట్టాలని రాహుల్ గాంధీ ఎన్నిమార్లు విజ్ఞప్తి చేసినా మోడీ పట్టించుకోవడం లేదు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలపై వివక్ష చూపిస్తుండడంతో కాంగ్రెస్ అధికారంలో ఉన్న తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచింది. జనగణనను బీజేపీ వాయిదా వేస్తుండటంతో కాంగ్రెస్ తొలుత తాము అధికారంలో ఉన్న తెలంగాణలో ప్రయోగత్మకంగా కులగణనను పూర్తి చేసి దేశానికే ఆదర్శంగా నిలిచింది. సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా ఎస్సీ వర్గీకరణ బిల్లును కూడా అమలు పరిచి ఎస్సీ వర్గీకరణ ఆమోదించిన తొలి రాష్ట్రంగా నిలిచింది. అంతేగాక ప్రస్తు తం రాష్ట్రంలో 56 శాతమున్న బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో, విద్య, ఉపాధి రంగాల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ మార్చి 17వ తేదీన బిల్లును ఆమోదించి చరిత్ర సృష్టించింది. కానీ బీసీ రిజర్వేషన్ల అంశాన్ని కూడా మత కోణంలోనే చూస్తూ బీజేపీ బడుగు బలహీనవర్గాలకు అన్యాయం చేస్తుంది. ముస్లింలను బీసీల్లో కలిపారనే కుంటి సాకుతో బడుగు బలహీన వర్గాలకు రిజర్వేషన్లు దక్కకుండా బీసీ రిజర్వేషన్ల బిల్లుకు చట్టబద్దత కల్పించడం లేదు. బీజీపీ పాలిత రాష్ట్రాల్లో ముస్లింలు బీసీల్లో లేనిది తెలంగాణలో ఎందుకు ఉండకూడదు?
ఆ నేతల వారసత్వాన్ని అందిపుచ్చుకొని..
పేద ప్రజల సంక్షేమం, లౌకికవాదం, ప్రజా సంక్షేమం కోసం కాంగ్రెస్ కృషి చేస్తుంటే బీజేపీ మాత్రం ఒంటెత్తు పోకడలతో పాలన సాగిస్తుంది. ఒకే దేశం ఒకే ఎన్నిక తీసుకొచ్చేందుకు కుట్రలు పన్నుతుండటంతో పాటు, జనాభా ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన చేసి దక్షిణాదికి అన్యాయం చేసేలా దేశంలో విభజన రాజకీయాలకు పాల్పడుతోంది. అంతేకాకుండా ముస్లిం మైనార్టీలపై కక్షగట్టి తాజాగా వివాదాస్పద వర్ఫ్ బోర్డు చట్టానికి సవరణలు చేసి ముస్లిం సోదరుల్లో అభద్రతా భావం సృష్టించింది. బీజేపీ వైఖరితో దేశ ప్రజాస్వామ్యానికి ప్రమాదం ఏర్పడిన దశలో బెళగావిలో సీడబ్ల్యూసీ పిలుపు మేరకు ‘జై బాపు, జై బీమ్, జై సంవిధాన్' కార్యక్రమాలను ఇప్పటికే పెద్ద ఎత్తున నిర్వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ శ్రేణులు వీటిని మరింత ఉధృతంగా చేపట్టేందుకు సిద్దమవుతున్నారు. అహ్మదాబాద్ వేదికగా నిర్వహించిన ఏఐసీసీ సమావేశాల్లో దేశం కోసం పోరాడిన గాంధీ, నెహ్రు, పటేల్, ఇతర నేతలను స్ఫూర్తిగా తీసుకొని బీజేపీ ప్రజాసామ్య వ్యతిరేక కార్యక్రమాలను ఎండగట్టాలని కాంగ్రెస్ పిలుపిచ్చింది. దేశంలో విద్వేష రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాడాలని సమావేశం తీర్మానించింది. విభజన రాజకీయాల్లో పేరుగాంచిన బీజేపీ స్వాతంత్ర సమరయోధులను కూడా విడదీస్తూ గాంధీ, నెహ్రూ, పటేల్ మధ్య విభేదాలున్నాయని సృష్టించిన అపోహలకు వ్యతిరేకంగా ఆ నేతల వారసత్వాన్ని అందిపుచ్చుకొని, వారి అడుగుజాడల్లో అహింసా మార్గాల్లో పోరాడేందుకు కాంగ్రెస్ పార్టీ సన్నద్ధమైంది. దేశానికి ప్రమాదకరంగా మారిన బీజేపీ పాలనకు చరమగీతం పాడేందుకు పోరాడుతున్న కాంగ్రెస్కు, రాహుల్ గాంధీకి ప్రజాస్వామ్య వాదులు, ప్రజా సంఘాలు, మేధావులు చేదోడుగా నిలవాలి.
-రాచమల్ల సిద్ధేశ్వర్,
చైర్మన్, రాజీవ్ గాంధీ పంచాయతీరాజ్ సంఘటన్, తెలంగాణ