Shahid Kapoor : ముంబైలో అపార్ట్‌మెంట్‌ తీసుకున్న షాహిద్ కపూర్.. నెలకు అన్ని లక్షల రెంట్ కడుతున్నాడా?

by Prasanna |
Shahid Kapoor : ముంబైలో అపార్ట్‌మెంట్‌ తీసుకున్న షాహిద్ కపూర్.. నెలకు  అన్ని లక్షల రెంట్ కడుతున్నాడా?
X

దిశ, వెబ్ డెస్క్ : బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుని బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. బాలీవుడ్ లో ఈ హీరోని లవర్ బాయ్ గా పిలుస్తారు. 2015లో మీరా అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం, ఈ దంపతులకి ఓక పాప, బాబు కూడా ఉన్నారు.

అయితే, తాజాగా షాహిద్ కపూర్ ముంబైలోని త్రీ సిక్స్టీ వెస్ట్, వర్లీలో విలాసవంతమైన అపార్ట్‌మెంట్‌ను అద్దెకు తీసుకున్నాడు. ఆ ఇంటికి అద్దె ప్రతీ నెల 20 లక్షలు కడుతున్నాడు. అంతే కాకుండా, ఈ అద్దె మొత్తం 23 లక్షలకి చేరుతుందని సమాచారం. ఈ ఇంటికి సంబంధించిన అగ్రిమెంట్ ను ఐదేళ్ళ పాటు చేసుకున్నారట.

సినీ సెలబ్రిటీస్ లో చాలా మంది ముంబైలోనే ఉంటారు. అక్కడే, కోట్లు విలువ చేసే విలాసవంతమైన విల్లాలను కూడా కొనుగోలు చేస్తుంటారు. హీరోలు తమ భార్య పిల్లలతో ఇక్కడే ఉంటారు. ఇక, ఇప్పుడు ఆ లిస్టులో షాహిద్ కపూర్ కూడా చేరాడు.

Advertisement

Next Story