గూస్ బంప్స్ తెప్పిస్తున్న షారుఖ్ నయాలుక్.. ఖుష్ అవుతున్న ఫ్యాన్స్

by Manoj |
గూస్ బంప్స్ తెప్పిస్తున్న షారుఖ్ నయాలుక్.. ఖుష్ అవుతున్న ఫ్యాన్స్
X

దిశ, సినిమా: బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్ మూడేళ్ల గ్యాప్ తర్వాత 'ప‌ఠాన్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ మూవీలో షారుఖ్ సరసన దీపిక పదుకొణె కీలకపాత్రలో జాన్ అబ్రహం నటిస్తుండగా.. ఈ మూవీ అప్‌డేట్ కోసం ఎక్జయిటింగ్‌గా ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్. అయితే ఇటీవల షూటింగ్‌కు సబంధించిన ఫొటోలు లీక్ అయిన విషయం తెలిసిందే.

దీంతో ఏ మాత్రం ఆలస్యం చేయకుండా షారుఖ్ ఈ సినిమా నుంచి తాజాగా ఫస్ట్‌లుక్ రిలీజ్ చేశాడు. ఈ నయా లుక్‌లో రెండు తాళ్లతో వేలాడుతున్న షారుఖ్ 8 ప్యాక్ యాబ్స్, లాంగ్ హెయిర్‌తో స్టన్నింగ్ లుక్‌తో కొత్తగా క‌నిపిస్తుండగా.. ఇందుకు సంబంధించిన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. ప్రస్తుతం ఈ లుక్ ఇంట‌ర్‌నెట్‌ను షేక్ చేసేలా ఉండగా.. ఫైర్‌, హ‌ర్ట్‌, ట్రక్ ఎమోటిక‌న్స్‌ను పోస్ట్ చేస్తూ త‌మ అభిమానాన్ని చాటుకుంటున్నారు ఫ్యాన్స్. ఇక పఠాన్ 2023 జనవరి 25న విడుదల కానుంది.

Advertisement

Next Story