SERP ఉద్యోగుల చలో హైదరాబాద్.. వెంటనే రెగ్యులర్ చేయాలని డిమాండ్

by Javid Pasha |   ( Updated:2022-03-09 09:29:40.0  )
SERP ఉద్యోగుల చలో హైదరాబాద్.. వెంటనే రెగ్యులర్ చేయాలని డిమాండ్
X

దిశ, వెబ్‌డెస్క్: అసెంబ్లీలో కేసీఆర్ ఉద్యోగాల నోటిఫికేషన్‌తో నిరుద్యోగులంతా సంబరిపడిపోతున్నారు. కానీ సెర్ప్ ఉద్యోగులు మాత్రం ఆగ్రహంతో ఊగిపోతున్నారు. ఎన్నడో తమను రెగ్యులర్ చేస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారని, కానీ ఇప్పటివరకు దాని ఊసే ఎత్తలేదని వారు పేర్కొన్నారు. దీనిపై కేసీఆర్‌ను సంప్రదించగా మ్యానిఫెస్టోలో క్రమద్దీకరిస్తామని తెలిపారని, కానీ తీరా చూస్తే ప్రకటనలో కనీసం సెర్ప్ ప్రస్తావన కూడా లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. తమ రెగ్యులైజేషన్ ప్రక్రియను వెంటనే చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఉద్యోగ సంఘాలు రేపు చలో హైదరాబాద్‌కు శ్రీకారం చుట్టాయి. ఈ కార్యక్రమంలో ఉద్యోగులంతా పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. రేపు హైదరాబాద్ చేరిన తర్వాత మంత్రి ఎర్రబెల్లి, హరీష్ రావు, కేటీఆర్, ఎమ్మెల్సీ కవితను సంప్రదించనున్నట్లు వారు తెలిపారు.

Advertisement

Next Story