Khushboo Sundar: సూపర్ హిట్ ‘అరణ్మనై-4’ సినిమాకు సీక్వెల్.. క్లారిటీ ఇచ్చిన ఖుష్బూ (పోస్ట్)

by Hamsa |   ( Updated:2024-10-26 14:28:01.0  )
Khushboo Sundar: సూపర్ హిట్ ‘అరణ్మనై-4’ సినిమాకు సీక్వెల్.. క్లారిటీ ఇచ్చిన ఖుష్బూ (పోస్ట్)
X

దిశ, సినిమా: కోలీవుడ్ డైరెక్టర్ సుందర్(Sundar) తెరకెక్కించిన ‘అరణ్మనై’(Aranmanai) మూవీ ఇప్పటి వరకు నాలుగు భాగాలు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. అయితే దీనికి సీక్వెల్ ‘అరుణ్మనై-5’ రాబోతున్నట్లు గత కొద్ది కాలంగా వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా ఇందులో ఫస్ట్ లుక్ కూడా విడుదలైనట్లు ఓ పోస్టర్ నెట్టింట చక్కర్లు కొడుతోంది.

తాజాగా, ఖుష్బూ (Khushboo Sundar)ఇన్‌స్టాగ్రామ్ వేదికగా రియాక్ట్ అయి క్లారిటీ ఇచ్చింది. ‘‘తమిళ సినిమా విజయవంతమైన మరియు అతిపెద్ద ఎంటర్‌టైనర్ ‘అరణ్మనై-5’(Aranmanai-5) ఫ్రాంచైజీకి సిద్ధమవుతోందని చాలా ఊహాగానాలు, వార్తలు ప్రచారంలో ఉన్నాయి. అంతేకాకుండా ఫస్ట్ లుక్, పోస్టర్ డిజైన్‌ చేసి పోస్ట్ చేస్తున్నారు. కానీ అవన్నీ అబద్ధం. మేము సినిమా చేయడానికి ప్లాన్ చేసినప్పుడు సుందర్ ప్రకటిస్తారు. అప్పటి వరకు, #GANGERS వేచి ఉండండి. త్వరలో వస్తుంది’’ అని రాసుకొచ్చింది.

Advertisement

Next Story

Most Viewed

    null