- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఆ సినిమా హీరోకి రేచీకటి.. చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి : నిర్మాతలు
దిశ, సినిమా : 'రాజావారు రాణిగారు' సినిమాతో హీరోగా కెరీర్ ప్రారంభించిన కిరణ్ అబ్బవరం.. ప్రస్తుతం 'సెబాస్టియన్ పిసి 524'తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. కాగా ఈ మూవీ విడుదల తేదీని అధికారికంగా ప్రకటించారు మేకర్స్. జ్యోవిత సినిమాస్ బ్యానర్‌పై సిద్ధారెడ్డి. బి, జయచంద్రా రెడ్డి, ప్రమోద్, రాజు సంయుక్తంగా నిర్మించిన చిత్రానికి బాలాజీ సయ్యపురెడ్డి దర్శకత్వం వహించగా మార్చి 4న విడుదల చేయనున్నట్లు తెలిపారు.
ఈ సందర్భంగా మాట్లాడిన నిర్మాతలు.. 'మా 'సెబాస్టియన్ పిసి524' ఖచ్చితంగా హిట్ అవుతుంది. 'హెలి' అనే పాటకు ఊహించని రెస్పాన్స్ లభించింది. ఇటీవలే విడుదలైన గ్లింప్స్ కూడా సూపర్ ట్రెండింగ్‌లో ఉన్నాయి. రేచీకటి సమస్య ఉన్న హీరోకి ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి? వాటిని ఎలా ఎదుర్కొన్నాడనే పాయింట్‌తో ఆసక్తికరంగా తెరకెక్కించాం' అన్నారు. ఇక ఈ సినిమాలో కిరణ్ సరసన కోమలి ప్రసాద్, నువేక్ష నటించగా జిబ్రాన్ సంగీతం అందించారు.