చలితో వణికిపోతున్నారా.. వేడి స్వభావాన్నిచ్చే ఈ బెల్లం ముక్క తినండి?

by Anjali |
చలితో వణికిపోతున్నారా.. వేడి స్వభావాన్నిచ్చే ఈ బెల్లం ముక్క తినండి?
X

దిశ, వెబ్‌డెస్క్: బెల్లంతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు. బెల్లంలోని పోషకాలు కడుపు ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలు తగ్గించడంలో మేలు చేస్తుంది. అలాగే బెల్లంలోని ఐరన్ రక్తాన్ని శుద్ధి చేయడంలో తోడ్పడుతుంది.

చర్మ సౌందర్యాన్ని మెరుగుపరుస్తుంది. బెల్లంలోని పోషకాలు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. అలసటను దూరం చేయడమే కాకుండా.. మోకాళ్ల నొప్పి, ఆస్తమా, చెవి నొప్పి వంటి సమస్యల్ని దూరం చేస్తుంది. బెల్లం రోగనిరోధక శక్తి బూస్టర్. గొంతు నొప్పి, దగ్గు నుంచి ఉపశమనం చేస్తుంది అలాగే జలుబుకు సహజ నివారణగా పనిచేస్తుంది. ఫ్లూతో పోరాడుతుంది. బెల్లంలో కాల్షియం ఎముకలను స్ట్రాంగ్‌గా ఉంచుతుంది. దీనిలోని ఇనుము, ఫాస్ఫరస్ రక్తహీనత సమస్యకు చెక్ పెడుతుంది.

ప్రెగ్రెన్సీ మహిళలు బెల్లం తింటే అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయని నిపుణులు చెబుతూనే ఉంటారు. అయితే ఇప్పుడు శీతాకాలం కాబట్టి జనాల్ని చలి వణికిస్తుంది. ప్రజలు బయటకు వెళ్లాలంటే ఉదయం సమయంలో జంకుతున్నారు. అయితే చలికాలంలో బెల్లం ముక్క నోట్లో వేసుకుంటే చలి తీవ్ర కాస్త తక్కువగా అనిపిస్తుందని నిపుణులు చెబుతున్నారు. బెల్లంకు వేడి స్వభావం ఎక్కువగా ఉంటుందని, కాగా శరీరాన్ని వెచ్చగా ఉంచుతుందని చెబుతున్నారు. కాగా రాత్రి భోజనం తర్వాత బెల్లం తినవచ్చని సూచిస్తున్నారు.

గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. మీ అవగాహన కోసం నిపుణులు అందించిన సమాచారం మాత్రమే అందిస్తున్నాం. పై వార్తలో మీకు అనుమానాలు ఉంటే కనుక నిపుణులకు సంప్రదించగలరు.

Advertisement

Next Story