- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
రోడ్డు ప్రమాదాల నియంత్రణకు పటిష్ట చర్యలు
దిశ, పెద్దపల్లి : రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి రోడ్డు భద్రత ప్రమాణాలపై అవగాహన కల్పించేలా రోడ్డు భద్రత వారోత్సవాలను విజయవంతంగా నిర్వహించాలని రాష్ట్ర బీసీ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. శనివారం ఆయన హైదరాబాద్ నుంచి రోడ్లు భవనాల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్ తో కలిసి రోడ్డు భద్రత వారోత్సవాల నిర్వహణపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష, అదనపు కలెక్టర్లు జె.అరుణ శ్రీ,, డి.వేణులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ గతంలో కేంద్ర ప్రభుత్వం రోడ్డు భద్రత వారోత్సవాలు నిర్వహించేదని, దీని ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకొని నేడు రోడ్డు భద్రతా వారోత్సవం చేపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రతి శాఖను భాగస్వామ్యం చేస్తూ వినూత్నంగా ప్రజలకు చేరేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు.
రోడ్డు భద్రత ప్రమాణాలపై వేడుకలను ప్రతి గ్రామంలో జరగాలని అన్నారు. పిల్లల్లో రోడ్డు భద్రతా ప్రమాణాలపై అవగాహన కల్పించేందుకు ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు. సంక్రాంతి సెలవుల తర్వాత విద్యార్థులచే ప్రతి జిల్లా, మండల హెడ్ క్వార్టర్ లో భారీ ర్యాలీ చేపట్టాలని అన్నారు. ఆర్ అండ్ బీ, పంచాయతీ రాజ్ శాఖ తమ పరిధిలో రోడ్డు భద్రతా ప్రమాణాల కార్యక్రమాలు జరగాలని అన్నారు. రవాణా, పోలీస్, విద్యా, రోడ్లు భవనాలు, పంచాయతీ రాజ్ శాఖ అధికారులు సమన్వయంతో పనిచేస్తూ రోడ్డు భద్రత కార్యక్రమాలు విజయవంతం చేయాలని కోరారు. భారీ తుఫాన్లు, వరదలు, తదితర వాటి వల్ల పోయే ప్రాణాల కంటే ప్రమాదంలో అధికంగా పోతున్నామని, రోడ్డు ప్రమాదాల నియంత్రణకు మనమంతా కలిసి పని చేయాలని అన్నారు. రోడ్డు భద్రతా ప్రమాణాలను పిల్లల సిలబస్ లో కూడా పెట్టేలా చూస్తామని అన్నారు.
రోడ్డు భద్రత నియమాలను పాటించని వారి లైసెన్స్ రద్దు చేసి భవిష్యత్తులో జారీ చేసేందుకు వీలు లేకుండా సాఫ్ట్వేర్ రూపొందించేందుకు ప్రయత్నిస్తున్నామని, ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలని అన్నారు. రోడ్డు భద్రత ప్రమాణాల కార్యక్రమాలకు విస్తృత ప్రచారం ఉండాలని, స్థానిక మంత్రులు, ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేయాలని అన్నారు. రోడ్డు భద్రత ప్రమాణాల అవగాహన కార్యక్రమాల్లో హెల్మెట్ వినియోగం వల్ల కలిగే లాభాలను విస్తృతంగా ప్రచారం చేయాలని, ద్విచక్ర వాహన దారులు హెల్మెట్ వినియోగించేలా ప్రోత్సహిస్తూ కొంతమందికి హెల్మెట్ పంపిణీ చేయాలని, ఈ కార్యక్రమాలను సామాజిక మాధ్యమాల ద్వారా విస్తృత ప్రచారం కల్పించాలని అన్నారు.
రోడ్డు భవనాల శాఖ స్పెషల్ సీఎస్ వికాస్ రాజ్ మాట్లాడుతూ జనవరి నెల మొత్తం రోడ్డు భద్రత ప్రమాణాల కార్యక్రమాలను నిర్వహించాలని అధికారులకు తెలిపారు. ప్రస్తుత సమాజంలో జరిగే రోడ్డు ప్రమాదాలలో 75 శాతం డ్రైవర్ తప్పుల వల్ల జరుగుతున్నాయని అన్నారు. రాష్ట్రంలోని వాహనాలు నడిపే ప్రతి ఒక్కరికి రోడ్డు భద్రత ప్రమాణాలు, పాటించాల్సిన నియమ నిబంధనలపై అవగాహన కల్పించాలని అన్నారు. ఈ సమావేశంలో డీసీపీ ఎం.చేతన, రవాణా శాఖ అధికారులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.