మహేష్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. నెక్స్ట్ అలాంటి సినిమానే..??

by Javid Pasha |
మహేష్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. నెక్స్ట్ అలాంటి సినిమానే..??
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం 'సర్కారు వారి పాట' మూవీ నుంచి భారీ ట్రీట్ సిద్ధమవుతోంది. ఇందులో కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ బ్యాంకు కుంభకోణం నేపథ్యంలో తెరకెక్కుతోంది. ఈ సినిమా మే 12న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది. ప్రస్తుతం మూవీ మేకర్స్ మహేష్ ఫ్యాన్స్‌ భారీ ట్రీట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారట. మహేష్ ఫ్యాన్స్‌కు 'సర్కారు' వారి మాస్ సైడ్ చూపించేందుకు అంతా సిద్ధం చేస్తున్నారట.

తాజాగా 'కలావతి' సాంగ్‌తో క్లాస్‌గా పిచ్చెక్కించారు. కానీ ఈ సారి మాత్రం పక్కా మాస్ సాంగ్‌తో మహేష్ ఫ్యాన్స్‌ను అదరగొట్టేందుకు రెడీ అవున్నారు. పక్కా మాస్ ట్యూన్‌లో సాంగ్ రిలీజ్ చేసేందుక మేకర్స్ ముహూర్తం కూడా ఫిక్స్ చేసేశారట. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా త్వరలోనే రానుందని నెట్టింట వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. మరి దీనిపై త్వరలో ఏమైనా క్లారిటీ వస్తుందేమో చూడాలి.

Advertisement

Next Story