మెద్వెదేవ్‌కు షాక్.. ఏటీపీ ర్యాంకింగ్స్‌‌లో డౌన్

by Manoj |
మెద్వెదేవ్‌కు షాక్.. ఏటీపీ ర్యాంకింగ్స్‌‌లో డౌన్
X

న్యూఢిల్లీ: రష్యన్ స్టార్ టెన్నిస్ ప్లేయర్ డానియెల్ మెద్వేదేవ్ ఏటీపీ ర్యాంకింగ్స్‌లో మళ్లీ రెండో స్థానానికి పడిపోయాడు. ఇటీవల వరల్డ్ నంబర్ వన్ నోవాక్ జకోవిచ్‌ను వెనక్కి నెట్టి ప్రపంచ నంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకున్న మెద్వెదేవ్ కేవలం రెండు వారాల్లోనే ఆ స్థానాన్ని కోల్పోయాడు. తాజాగా దీనిపై మెద్వెదేవ్ స్పందిస్తూ.. 'జీవితంలో ఒక వారం ప్రపంచ నంబర్ వన్‌గా ఉండటం మంచిదని అన్నారు.

జీవితంలో మరొకసారి ఆ స్థానాన్ని 'టచ్' చేయకపోవడమే మంచిదని' వ్యాఖ్యానించారు. కాగా, ఫిబ్రవరి 28న మెద్వెదేవ్ తన టెన్నిస్ కెరీర్‌లో తొలిసారి ఏటీపీ ర్యాంకింగ్స్‌లో వరల్డ్ నంబర్ వన్ స్థానాన్ని అధిరోహించాడు. అయితే, సోమవారం జరిగిన ఇండియన్ వెల్స్ మాస్టర్స్ మూడో రౌండ్‌లో ఫ్రెంచ్ ఆటగాడు గేల్ మోన్‌ఫిల్స్ చేతిలో రష్యన్ ఆటగాడు మెద్వెదేవ్ ఓడిపోవడంతో అతని ర్యాంక్ నంబర్ -2కు పడిపోయింది.

Advertisement

Next Story