TG Minister: అంతఃకరణ శుద్ధితో అమలుచేస్తున్నాం

by Gantepaka Srikanth |
TG Minister: అంతఃకరణ శుద్ధితో అమలుచేస్తున్నాం
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రేమ, సహనం, త్యాగం, దాతృత్వమనే సుగుణాల ఆచరణ ద్వారా మానవాళిని సన్మార్గం వైపు నడిపించిన ఏసుక్రీస్తు(Jesus) జీవనం మనందరికీ ఆదర్శనీయమైనదని అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ(Minister Konda Surekha) అన్నారు. ఏసుక్రీస్తు జన్మదినోత్సవమైన క్రిస్మస్(Christmas) పండుగ(డిసెంబర్ 25)ను పురస్కరించుకుని మంత్రి కొండా సురేఖ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. తన జీవనవిధానం ద్వారా అత్యుత్తమ జీవన విలువలను నెలకొల్పిన ఏసుక్రీస్తు సర్వకాలాల్లోనూ ఆరాధ్యనీయుడని మంత్రి సురేఖ పేర్కొన్నారు.


కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యాంగం ప్రవచించిన లౌకికవాద స్ఫూర్తితో సర్వమానవ సమానత్వం అనే భావనను అంతఃకరణశుద్ధితో అమలు చేస్తున్నదన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు దళిత క్రిస్టియన్లకు ఎంతో ఊరటనిస్తున్నాయని మంత్రి తెలిపారు. క్రిస్మస్ పండుగ ప్రతి ఒక్కరి జీవితంలో శాంతిని, సంతోషాన్ని, సమృద్ధిని తీసుకురావాలని మంత్రి సురేఖ ఆకాంక్షించారు.

Advertisement

Next Story

Most Viewed