- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మైనర్లపై రష్యా సైనికుల లైంగికదాడి: ఉక్రెయిన్ ఎంపీ
కీవ్: రష్యా సైనికులు తమ దేశ యువతులపై లైంగికదాడులకు పాల్పడినట్లు ఉక్రెయిన్ ఎంపీ లెసియా వాసిలెంక్ ఆరోపించారు. ఈ మేరకు రష్యన్ సైనికులు తమ దేశ చిన్నారులపై దారుణాలకు పాల్పడ్డారని ట్వీట్ చేశారు. రష్యా దళాలు ఉక్రెయిన్‌లో ప్రజలను దోచుకుంటున్నాయని, అత్యాచారం చేసి, చంపేస్తున్నాయని తెలిపారు. దీంతో రష్యాను అనైతిక నేరాల దేశంగా మారిందని వాసిలెంక్ చెప్పారు. రష్యన్ సైనికులు 10 ఏళ్ల బాలికలను దోచుకుని, లైంగిక దాడికి పాల్పడి హతమార్చారు. ప్రైవేట్ పార్టులను నాశనం చేశారు. మహిళకు కాలిన గాయాలు చేశారు. రష్యన్ వ్యక్తులే ఈ దారుణానికి పాల్పడ్డారు. రష్యా తల్లులు వీరిని పెంచారు. అనైతిక నేరాల దేశంగా మారింది' అని ట్వీట్ చేశారు. ఓ ఫోటోగ్రాఫ్ ను షేర్ చేస్తూ మహిళను దారుణంగా లైంగికంగా హింసించి, హతమార్చారు అని తెలిపారు. ఇలాంటి ఘటనలు చూసి తాను మూగబోయానని చెప్పారు. భయం, ద్వేషంతో తన మెదడు మొద్దుబారిందని అన్నారు.
రష్యా- ఉక్రెయిన్ యుద్ధ విశేషాలు
ఫిబ్రవరి 24న రష్యా ఉక్రెయిన్ పై దాడి ప్రారంభించింది. ఈ యుద్ధంలో ఇప్పటివరకు వేల సంఖ్యలో సైనికులు మరణించారు. అంతే సంఖ్యలో పౌరులు మరణించినట్లు ప్రభుత్వం పేర్కొంది. ఇక యుద్ధ ప్రభావంతో 40 లక్షలకు పైగా మంది నిరాశ్రయులయ్యారు. పలు ధపాల చర్చలు తర్వాత రష్యా తమ బలగాలను వెనక్కి తీసుకునేందుకు అంగీకరించింది. అదే సమయంలో పలుప్రాంతాల్లో దాడులను కొనసాగిస్తుంది. అయితే రష్యా యుద్ధ నేరాలకు పాల్పడినట్లు ఆరోపిస్తున్నప్పటికీ, రష్యా వాటిని కొట్టి పారేసింది.