- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
సమతామూర్తి వద్దకు ఆర్టీసీ బస్సులు
దిశ, తెలంగాణ బ్యూరో : హైదరాబాద్ శివారులోని ముచ్చింతల్ సమతామూర్తి విగ్రహం వద్దకు వీకెండ్‌లో బస్సు సౌకర్యం కల్పించాలని ఆర్టీసీ అధికారులను ఆ సంస్థ ఎండీ సజ్జనార్ ఆదేశించారు. సమతామూర్తి విగ్రహం వద్దకు నేరుగా ఆర్టీసీ బస్సుల్లేవని, అక్కడికి వెళ్లేందుకు క్యాబ్ వాళ్లు రూ.1000 వరకు వసూలు చేస్తున్నారని ట్విట్టర్‌లో ఎండీ దృష్టికి ఓ నెటిజన్ తీసుకెళ్లారు. వీకెండ్‌లో అక్కడికి ఆర్టీసీ బస్‌లను ఏర్పాటు చేస్తే.. సామాన్యులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని కోరారు.
ఈ ట్వీట్ కు సజ్జనార్ సానుకూలంగా స్పందించారు. "ఆర్టీసీ పట్ల మీ ఆసక్తికి ధన్యవాదాలు. ఈ మార్గంలో ఆర్టీసీ బస్‌ను ఏర్పాటు చేయండి. అందుకు అనుగుణంగా సమయాలను అప్ డేట్ చేయండి" అని ఆర్టీసీ అధికారులను ఆయన ఆదేశించారు. ఆర్టీసీ ఉన్నతాధికారుల ఖాతాలను ట్యాగ్ చేశారు. సమతామూర్తి విగ్రహం వద్దకు బస్ సౌకర్యం ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటామని ఆ ట్వీట్ కు ఉన్నతాధికారులు సమాధానం ఇచ్చారు.
హైదరాబాద్ శివారులోని ముచ్చింతల్ సమతామూర్తి విగ్రహం వద్దకు నేరుగా ఆర్టీసీ బస్సుల్లేవు. అక్కడికి వెళ్లేందుకు రూ.1000 వరకు క్యాబ్ వాళ్లు ఛార్జ్ చేస్తున్నారు. కనీసం వీకెండ్ లోనైనా ఆర్టీసీ బస్ లను ఏర్పాటు చేస్తే.. సామాన్యులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది @tsrtcmdoffice. #Hyderabad pic.twitter.com/IML2d4lPdW
— Abhinay Deshpande (@iAbhinayD) March 20, 2022