Mohan Babu: వివాదం తర్వాత మోహన్ బాబు మొదటి ట్వీట్.. ఇది నాకు ఎప్పటికి గుర్తుండి పోతుంది అంటూ కామెంట్స్

by sudharani |   ( Updated:2024-12-20 14:03:47.0  )
Mohan Babu: వివాదం తర్వాత మోహన్ బాబు మొదటి ట్వీట్.. ఇది నాకు ఎప్పటికి గుర్తుండి పోతుంది అంటూ కామెంట్స్
X

దిశ, సినిమా: ప్రజెంట్ తెలుగు రాష్ట్రాల్లో మోహన్ బాబు (Mohan Babu) ఫ్యామిలీ వివాదం హాట్ టాపిక్‌గా మారాయి. దానికి తోడు మోహన్ బాబు రిపోర్టర్‌ (reporter)పై దాడి చేయడంతో ఈ వివాదంపై అందరి దృష్టి మళ్లింది. ఇలాంటి సమయంలో మంచు మోహన్ బాబు పెట్టిన ట్వీట్ (tweet) వైరల్‌గా మారింది. చిరంజీవి (Chiranjeevi), మోహన్ బాబు కలిసి నటించిన చిత్రాల్లో ‘పట్నం వచ్చిన పతివ్రతలు’ (Patnam Vachina Pativrathalu) ఒకటి. మౌళి దర్శకత్వంలో వహించిన ఈ మూవీలో రాధిక (Radhika), గీత (Geetha) హీరోయిన్లుగా నటించారు.

1982లో విడుదలైన ఈ సినిమాను గుర్తుచేసుకుంటూ సోషల్ మీడియా (Social media)లో ఓ పోస్ట్ పెట్టాడు మోహన్ బాబు. ‘నా ప్రయాణంలో ‘పట్నం వచ్చిన పతివ్రతలు’ (1982) సినిమాకి ప్రత్యేక స్థానం ఉంది. దీనికి ప్రతిభావంతులైన శ్రీ మౌలీ (Moulee) దర్శకత్వం వహించారు. ఈ పాత్రను నేను పోషించడం, ముఖ్యంగా నా ప్రియమైన స్నేహితుడు చిరంజీవితో స్క్రీన్‌ను పంచుకోవడం, అలాగే నేను చిరంజీవి అన్నదమ్ములుగా నటించడం చాలా ప్రత్యేకంగా అనిపించింది. ఈ సినిమా నాకు మరిచిపోలేని చిత్రాల్లో ఒకటిగా మిగిలిపోయింది’ అంటూ ఆ సినిమా నుంచి ఓ వీడియోను షేర్ చేశారు. ప్రజెంట్ ఈ పోస్ట్ వైరల్ అవుతోంది.

Advertisement

Next Story

Most Viewed