- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Winter and Yoghurt : చలికాలంలో పెరుగు తింటే నిజంగానే జలుబు చేస్తుందా?
దిశ, ఫీచర్స్ : చలికాలంలో పెరుగు తింటున్నారా..? ఇష్టంగా మజ్జిగ తాగేస్తున్నారా..? వామ్మో అలా అయితే జలుబు చేయదా? అంటుంటారు కొందరు. పైగా కూల్ వెదర్‌లో పెరుగు తింటే జలుబుతోపాటు గొంతునొప్పి, జ్వరం వస్తాయని, గొంతులో కఫం పేరుకుపోతుందని చెప్తుంటారు. అంతేకాకుండా పెరుగులో చలువ చేసే గుణాలు ఉంటాయి కాబట్టి శ్వాసకోశ సమస్యలు అధికం అవుతాయని భావిస్తుంటారు. కానీ ఇవన్నీ కేవలం అపోహలే అంటున్నారు ఆరోగ్య నిపుణులు. వాస్తవానికి పెరుగు తినడానికి కాలాలు, సీజన్లతో సంబంధం లేదని, ఎప్పుడు తిన్నా ఆరోగ్యానికి మంచిదని చెబుతున్నారు. అదెలాగో చూద్దాం.
*పెరుగులో ప్రోబయోటిక్స్ అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలో మంచి బ్యాక్టీరియాను ప్రోత్సహించడం ద్వారా రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. చలికాలంలో తింటే జలుబు, గొంతు నొప్పి, ఫ్లూ వంటి సీజనల్ వ్యాధులు రాకుండా ఉంటాయి. అయితే చలికాలంలో ఫ్రిడ్జ్‌లో పెట్టిన చల్లని పెరుగును వెంటనే తినవద్దు. ఉష్ణోగ్రత స్థాయిలో పెట్టి తినడం మంచిది.
* చలికాలంలో పెరుగు తినడంవల్ల జీర్ణక్రియ ఆరోగ్యం మెరుగుపడుతుంది. అజీర్తి, కడుపులో ఉబ్బరం వంటి సమస్యలు తగ్గుతాయి. ఆహారాన్ని సులువుగా విచ్ఛిన్నం చేసే బ్యాక్టీరియాలు ఉండటంవల్ల పెరుగు ఆరోగ్యానికి చాలా మంచిది. అలాగు ఇందులో కాల్షియం, ప్రోటీన్లు, విటమిన్ బి12 పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకల సాంద్రతను, కండర ద్రవ్యరాశిని పెంచుతాయి. పెరుగులో లాక్టిక్ యాసిడ్ అధికంగా ఉంటుంది. కాబట్టి చలికాలంలో తింటే చర్మ ఆరోగ్యానికి మంచిది. వృద్ధాప్య ఛాయలను నివారించడంలో పెరుగు మెడిసిన్‌లా పనిచేస్తుంది. పెరుగులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలో వాపును, దీర్ఘకాలిక వ్యాధులను తగ్గించడంలో సహాయపడతాయి.
* నోట్ : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా పలు అధ్యయనాల నుంచి సేకరించబడింది.
Read More...
Fennel Milk : పాలల్లో సోంపు కలిపి తాగితే..?