- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నర్సరీల్లో పండ్ల మొక్కలు నాటాలి
దిశ, మేడిపల్లి : నర్సరీల్లో పండ్ల మొక్కలు నాటాలని జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. శుక్రవారం మేడిపల్లి మండల కేంద్రంలోని నర్సరీ, వైకుంఠధామం, డంపింగ్ యార్డ్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నర్సరీలో కలుపు మొక్కలను తొలగించాలని వివిధ రకాల పండ్ల, పూల మొక్కలు పెంచాలన్నారు. అలాగే శతాబ్ది సంపద వనాలను చెట్లను పరిశీలించారు.
వైకుంఠధామం పరిశీలించి ఆవరణలో పిచ్చి మొక్కలను తొలగించాలని, నీటి సదుపాయం కల్పించాలని కోరారు. మూత్రశాలను శుభ్రపరచాలని, ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. అలాగే డంపింగ్ యార్డ్ కంపోస్ట్ షెడ్ పరిశీలించి, తడి చెత్త, పొడి చెత్త వేరువేరుగా సేకరించాలని ఆదేశించారు. డంపింగ్ యార్డ్ చుట్టూ తిరుగుతూ చెత్త వ్యర్థాలను పడేయకుండా చూడాలని అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో వసంత, ఎంపీడీఓ పద్మావతి, ఎంపీ ఓ నీరజ అధికారులు పాల్గొన్నారు.