పదో తరగతిలో వందశాతం ఉత్తీర్ణత సాధించాలి

by Naveena |
పదో తరగతిలో వందశాతం ఉత్తీర్ణత సాధించాలి
X

దిశ , గాంధారి : పదవతరగతి విద్యార్థులు వందశాతం ఉత్తీర్ణత సాధించాలని కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. శుక్రవారం మండలంలోని పోతంగల్ కలాన్ గ్రామం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులకు వడ్డించే మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. కిచెన్ షెడ్ పరిశుభ్రంగా ఉంచుకోవాలని వంట వారికి సూచించారు. అనంతరం స్టోర్ రూంలో బియ్యాన్ని పరిశీలించారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం ఇవ్వాలని తెలిపారు. అనంతరం పదవతరగతి విద్యార్థుల తో సిలబస్ గురించి అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు ప్రశ్నలు అడిగి సమాధానం చెప్పిన విద్యార్థులను అభినందించారు.

ఇందిరమ్మ ఇండ్ల సర్వే పరిశీలన

అక్కడ నుండి నేరుగా ఇందిరమ్మ ఇండ్ల సర్వే వద్దకు వెళ్లి సర్వే చేస్తున్న పంచాయతీ సెక్రటరీతో మాట్లాడి పలు సూచనలు చేశారు. కమ్యూనిటీ హెల్త్ సెంటర్ పరిశీలన కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో రికార్డుల పరిశీలించారు. నూతనంగా నిర్మిస్తున్న కమ్యూనిటీ హెల్త్ సెంటర్ భవనాన్ని పరిశీలించి తొందరగా పూర్తి అయ్యేలా చూడాలని అన్నారు. అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించి టీచర్ ల గురించి ఆరా తీశారు. ఎల్లారెడ్డి డివిజన్ లో 50% ఖాళీలు ఉన్నాయి అని సంబంధిత అధికారులు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. ఖాళీలు ఎక్కడ ఎక్కడ ఉన్నాయో లిస్ట్ చేసి తనకు ఇవ్వాలని వారిని కలెక్టర్ ఆదేశించారు. అనంతరం గాంధారి మండల కేంద్రంలో నర్సరీ ని తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, ఎంపిడిఓ రాజేశ్వర్, నాయబ్ తహసీల్దార్ రవి, ఎంపిఓ లక్ష్మీనారాయణ, ఎఎంసి ఛైర్మన్ పరమేశ్, ఎంఇఓ,పంచాయతీ సెక్రటరీ నాగరాజ్,మాజీ సర్పంచ్ బాలరాజు మండల అధికారులు గ్రామస్తులు పాల్గొన్నారు

Advertisement

Next Story

Most Viewed