భూ ప‌రిపాల‌న‌లో సువ‌ర్ణాధ్యాయం ఆర్వోఆర్ చ‌ట్టం

by Bhoopathi Nagaiah |
భూ ప‌రిపాల‌న‌లో సువ‌ర్ణాధ్యాయం ఆర్వోఆర్ చ‌ట్టం
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో నూత‌న ఆర్వోఆర్ చ‌ట్టంతో భూ ప‌రిపాల‌న‌లో కొత్త అధ్యాయం మొద‌లు కానుంద‌ని డిప్యూటీ క‌లెక్టర్స్ అసోసియేష‌న్ రాష్ట్ర అధ్యక్ష కార్యద‌ర్శులు వి.ల‌చ్చిరెడ్డి, కె.రామ‌కృష్ణ అన్నారు. చ‌రిత్రలో నిలిచిపోయేలా నూత‌న ఆర్వోఆర్ చ‌ట్టం ఉంద‌న్నారు. రైతుల కోణం నుంచి, ప్రజాభిప్రాయాల మేర‌కు త‌యారు చేసిన చ‌ట్టమే భూ భార‌తిగా సేవ‌లు అందించ‌నుంద‌న్నారు. నూత‌న ఆర్వోఆర్ చ‌ట్టం-2024 భూ భార‌తి బిల్లు శుక్రవారం అసెంబ్లీలో పాస్ కావ‌డం ప‌ట్ల డిప్యూటీ క‌లెక్టర్స్ అసోసియేష‌న్ రాష్ట్ర అధ్యక్ష కార్యద‌ర్శులు వి.ల‌చ్చిరెడ్డి, కె.రామ‌కృష్ణ, తెలంగాణ త‌హ‌శీల్దార్స్ అసోసియేష‌న్ రాష్ట్ర అధ్యక్ష కార్యద‌ర్శులు ఎస్‌.రాములు, ర‌మేష్ పాక‌, సెక్రట‌రీ జ‌న‌ర‌ల్ పూల్‌సింగ్‌ చౌహాన్‌, మ‌హిళా అధ్యక్షురాలు రాధ‌, తెలంగాణ రెవెన్యూ స‌ర్వీసెస్ అసోసియేష‌న్ రాష్ట్ర అధ్యక్ష కార్యద‌ర్శులు బాణాల రాంరెడ్డి, వి.భిక్షం వేర్వేరు ప్రక‌ట‌న‌ల‌లో హ‌ర్షం వ్యక్తం చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం రైతుల‌కు, ప్రజ‌ల‌కు మెరుగైన, నాణ్యమైన‌ రెవెన్యూ సేవ‌ల‌ను అందించేందుకు నూత‌న ఆర్వోఆర్ చ‌ట్టాన్ని తెచ్చింద‌న్నారు. చ‌ట్టాన్ని తెచ్చేందుకు సీఎం రేవంత్‌రెడ్డి, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్‌రెడ్డి, చ‌ట్ట రూపక‌ల్పన‌లో సీసీఎల్ఏ న‌వీన్‌ మిట్టల్‌, భూ చ‌ట్టాల నిపుణులు భూమి సునీల్‌కుమార్ ఎంతో కృషి చేశారన్నారు. వీరంద‌రికీ కృత‌జ్ఙత‌లు తెలిపారు. కేంద్రీకృతంగా ఉన్న అధికారాలు కొత్త చ‌ట్టంతో వికేంద్రీకృతం కానున్నట్టుగా తెలిపారు. దీంతో ప్రతి స్థాయిలో రెవెన్యూ అధికారులు రైతుల‌కు, ప్రజ‌ల‌కు సేవ‌ల‌ను వేగంగా అందించే అవ‌కాశం ఉంటుంద‌న్నారు. ఉమ్మడి రాష్ట్రంలో రెండు, తెలంగాణ రాష్ట్రంలో ఒక‌టి ఆర్వోఆర్ చ‌ట్టాలు వ‌చ్చాయ‌న్నారు. ఈ మూడింటి కంటే ఇప్పుడొచ్చిన చ‌ట్టంతో రైతుల‌కు, ప్రజ‌ల‌కు ఎంతో మేలు జ‌రుగుతుంద‌న్నారు. ఈ సందర్భంగా భూమి సునీల్ ని సన్మానించారు.

Advertisement

Next Story

Most Viewed