లగచర్ల రైతులకు కుటుంబ సభ్యులు కన్నీటి స్వాగతం

by Kalyani |
లగచర్ల రైతులకు కుటుంబ సభ్యులు కన్నీటి స్వాగతం
X

దిశ, బొంరాస్ పేట్ : - గత నవంబర్ 11 అధికారులపై దాడి జరిగిన ఘటనలో అరెస్టై, సంగారెడ్డి సెంటర్ జైల్లో రిమాండ్ లో ఉన్న లగచర్ల, హకింపేట్, పుల్చర్లకుంట, రోటిబండ తండాల 17 మంది రైతులు శుక్రవారం ఉదయం విడుదల కావడంతో, సొంత గ్రామాలకు చేరుకున్నారు. 37 రోజుల పాటు జైలు జీవితం గడిపిన రైతులు ఊర్లోకి, తండాలకు రాగానే కుటుంబ సభ్యులు భావోద్వేగంతో అలింగణం చేసుకొని, గుండెకు హద్దుకుని, కన్నీరుమున్నీరయ్యారు. అంతకుముందు రైతులు ఊర్లోకి రాగానే,వారికి దిష్టి తీశారు. పూలదండలు వేసి, టపాకాయలు కాలుస్తూ ఘన స్వాగతం పలికారు. అనంతరం తమ,తమ గృహాలకు చేరుకొని,యోగక్షేమాలు అడిగి తెలుసుకుని భాధపడ్డారు. ఒక కుటుంబంలో..ఎన్ని రోజులైంది బిడ్డ ఇంట్లో తిని అంటూ తల్లి,కొడుకులు ఒకరినొకరు తినిపించుకుంటూ, భావోద్వేగానికి లోనయ్యారు. గర్భవతిగా ఉన్న జ్యోతి తన భర్తను చూసి గట్టిగా హద్దుకుని, కన్నీటి పర్యంతమైంది.

Advertisement

Next Story

Most Viewed