బంజారాహిల్స్ లో భూమి క‌బ్జా అవాస్త‌వం… స్ప‌ష్టం చేసిన అధికారులు

by Kalyani |
బంజారాహిల్స్ లో భూమి క‌బ్జా అవాస్త‌వం… స్ప‌ష్టం చేసిన అధికారులు
X

దిశ, ఖైరతాబాద్ : హైద‌రాబాద్ బంజారాహిల్స్ రోడ్ నంబ‌ర్.10 లో ఉన్న జ‌ల‌మండ‌లి 2.20 ఎక‌రాల‌ భూమి క‌బ్జాకు గురైంద‌ని వివిధ మాధ్య‌మాల్లో ప్ర‌చారమైన విష‌యం అవాస్త‌వ‌మ‌ని అధికారులు స్ప‌ష్టం చేశారు. వివిధ పత్రిక‌లు, మాధ్య‌మాల్లో జ‌రిగిన ప్ర‌చారంతో జ‌ల‌మండ‌లితో పాటు రెవెన్యూ, హైడ్రా, పోలీసు అధికారులు సంయుక్తంగా త‌నిఖీ చేశారు. ఈ సంద‌ర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ ప్రాంతంలో రెండు చోట్ల 2.20 ఎక‌రాల‌ జ‌ల‌మండ‌లి భూమి ఉంద‌ని తెలిపారు. ఒక ద‌గ్గ‌ర ఎక‌రా భూమి ఉంద‌ని అక్క‌డ జ‌ల‌మండ‌లికి చెందిన 6 ఎంఎల్ సామ‌ర్థ్యం కలిగిన‌ రిజ‌ర్వాయ‌ర్ ఉంద‌ని తెలిపారు.

బంజారాహిల్స్ రోడ్ నం. 2, 10, 14 ప్రాంతాల ప్ర‌జ‌ల‌కు ఇదే రిజ‌ర్వాయ‌ర్ నుంచి తాగునీటి స‌ర‌ఫ‌రా చేస్తున్నామ‌న్నారు. దీనికి 150 మీట‌ర్ల దూరంలో మ‌రో 1.20 ఎక‌రాలు ఉంద‌ని చెప్పారు. అయితే ఇది రాళ్ల‌తో కూడిన‌ ఖాళీ స్థ‌లం కావ‌డంతో రెవెన్యూ అధికారుల చేత స‌ర్వే నిర్వ‌హించి స్ప‌ష్ట‌మైన‌ స‌రిహ‌ద్దులు కూడా ఏర్పాటు చేశామ‌న్నారు. దీంతోపాటు ఈ స్థ‌లంపై తెలంగాణ హైకోర్టు స్టేట‌స్ కో ఆర్డ‌ర్ సైతం ఉన్న‌ట్లు వివ‌రించారు. హైకోర్టు ఆదేశాల మేర‌కే అక్కడ ఎలాంటి నిర్మాణాలు చేప‌ట్టలేద‌ని తెలిపారు. కాబ‌ట్టి, దిన‌ప‌త్రిక‌లు, మాధ్య‌మాల్లో వ‌చ్చిన ప్ర‌చారం అవాస్త‌వ‌మ‌ని అధికారులు తెలిపారు. ఈ క‌బ్జా అంశంపై హైకోర్టులో అఫిడ‌విట్ సైతం దాఖ‌లు చేస్తామ‌ని పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed