- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
నా వద్ద ఆధారాలు ఉన్నాయి.. మంత్రి జగదీశ్ రెడ్డి రాజీనామా చేయాలే: RS Praveen Kumar
దిశ, వెబ్‌డెస్క్: RS Praveen Kumar Demands Minister Jagadish Reddy Should Resign| తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి వెంటనే రాజీనామా చేయాలని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. తెలంగాణ సదరన్ పవర్ కంపెనీ ఆధ్వర్యంలో జరిగిన జూనియర్ లైన్ మెన్ మరియు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఎలక్ట్రికల్ రాత పరీక్షలో పెద్ద ఎత్తున స్కామ్ జరిగిందని ఆయన ఆరోపించారు. ఈ పరీక్షలను వెంటనే రద్దు చేసి మళ్లీ పరీక్షలు నిర్వహించాలని గురువారం ట్విట్టర్ వేదికగా డిమాండ్ చేశారు. జరిగిన అవకతవకలపై తన వద్ద ఆధారాలు ఉన్నాయని వాటిని రాచకొండ పోలీసులకు అందజేశానని చెప్పారు. ఒకే అభ్యర్థికి నాలుగు హాల్ టికెట్స్ ఇచ్చారని రాత పరీక్ష జరగడానికి రెండు రోజుల ముందే ఈ విషయాన్ని తాను టీఎస్ పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి దృష్టికి తీసుకువెళ్లానని చెప్పారు. తాను చెప్పిన విషయాన్ని పట్టించుకోకుండా యథేచ్ఛగా పరీక్ష నిర్వహించారని మండిపడ్డారు.
ఈ పరీక్షల్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందనే అనుమానాలు తనకు ఉన్నాయని అందువల్ల వెంటనే జూనియర్ లైన్ మెన్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఎలక్ట్రికల్ పరీక్షలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో స్పందించకుంటే బీఎస్పీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలను చేపడతామని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్పారు. తెలంగాణ నిరుద్యోగుల భవితవ్యాన్ని కాపాడటంలో ప్రభుత్వం విఫలం అయిందని పరీక్షల్లో చోటు చేసుకున్న అవినీతికి బాధ్యత వహిస్తూ తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఇదిలా ఉంటే జేఎల్ఎం ప్రశ్నాపత్రం లీక్ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేపుతోంది. లీక్ అంశంలో మలక్ పేట ఏడీఈ మహ్మద్ ఫిరోజ్ ఖాన్, మిర్యాలగూడ ఏడీఈ సైదులు అరెస్ట్ కావడంతో విద్యుత్తు శాఖ దీనిపై తీవ్రంగా స్పందిస్తోంది. ఆ ఇద్దరితో పాటు ఇంకెవరికైనా ఇందులో ప్రమేయం ఉందా? అనే అంశంపై ఆరా తీస్తోంది విద్యుత్ శాఖ. ఇప్పటికే విద్యుత్ శాఖ విజిలెన్స్ విభాగం రంగంలోకి దిగి శాఖపరమైన ప్రమేయం ఏ మేరకు ఉందనేదానిపై తీగ లాగేపనిలో ఉంది.
ఇది కూడా చదవండి: ఈటల భూములపై మళ్లీ ఎంక్వైరీ? ఇరుకున పెట్టేందుకు సీఎం కేసీఆర్ భారీ స్కెచ్?
- Tags
- RS Praveen Kumar