- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఆరుగురు పంచాయతీరాజ్ సిబ్బంది పై సస్పెన్షన్ వేటు
దిశ,ముత్తారం: మండలంలో పనిచేసే ఆరుగురు పంచాయతీరాజ్ సిబ్బందిని సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. మంగళవారం నాడు ముత్తారం ఎంపీడీవో కార్యాలయానికి ఉదయం 11.30 గంటలకు ఆకస్మిక తనిఖీ నిర్వహించిన జిల్లా కలెక్టర్ సిబ్బంది విధులకు గైర్హజరవడం గమనించారు. బయోమెట్రిక్ అటెండెన్స్ రిజిస్టర్లు పరిశీలించగా ఆ సిబ్బంది అనుమతి లేకుండా చాలా రోజులుగా విధులకు డుమ్మా కొట్టడం గమనించిన కలెక్టర్ , పలుమార్లు ఆ సిబ్బందికి మెమోలు జారీ చేసినప్పటికీ విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడాన్ని తీవ్రంగా పరిగణిస్తూ సస్పెండ్ చేశారు.
విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన ముత్తారం మండలం ఎంపీడీవో కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ ఎండి.ఖాదర్ పాషా, జూనియర్ అసిస్టెంట్ వి.నరేష్, కార్యాలయ సభ ఆర్డినేట్ ఎండి.ఫయాజ్, ఎంపీడీవో కార్యాలయంలో సిబ్బంది గా పని చేస్తున్న పంచాయతీ కార్యదర్శులు సురేందర్, ఫయాజ్ , జైపాల్ లను సస్పెండ్ చేసినట్లు కలెక్టర్ తెలిపారు.