CBSE: ఓపెన్ బుక్ ఎగ్జామ్ ప్రచారం అవాస్తవం

by Mahesh Kanagandla |   ( Updated:2024-11-19 15:25:13.0  )
CBSE: ఓపెన్ బుక్ ఎగ్జామ్ ప్రచారం అవాస్తవం
X

దిశ, నేషనల్ బ్యూరో: వచ్చే ఏడాది జరగనున్న 10, 12వ తరగతుల బోర్డు ఎగ్జామ్‌(Board Exam)లకు సంబంధించి సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ/CBSE) ఖండించింది. 2025 బోర్డు ఎగ్జామ్స్‌కు సంబంధించి సిలబస్‌ను 15 శాతం(Syllabus Reduction) తగ్గిస్తున్నారని, కొన్ని ఎంపిక చేసిన సబ్జెక్టులకు ఓపెన్ బుక్ పరీక్ష(Open Book Exam) నిర్వహిస్తారని జరుగుతున్న ప్రచారం అవాస్తవమని తెలిపింది. పరీక్ష విధానంలో, అంతర్గత సమీక్ష విధానంలో మార్పులు చేయట్లేదని, వచ్చే ఏడాది పరీక్షలకు సంబంధించి ఎలాంటి మార్పులు చేపట్టలేదని స్పష్టం చేసింది. ఎలాంటి మార్పులున్నా సీబీఎస్‌ఈ నేరుగా ప్రకటన విడుదల చేస్తుందని వివరించింది. తల్లిదండ్రులు, విద్యార్థులు ఇలాంటి తప్పుడు వార్తలను నమ్మొద్దని, వాస్తవ సమాచారం కోసం సీబీఎస్ఈ వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించింది. ఈ మేరకు సీబీఎస్ఈ అధికారిక ప్రకటన విడుదల చేసింది. 2014-25 బ్యాచ్ 10, 12వ తరగతులకు సింగిల్ టర్మ్ ఎగ్జామ్స్ ఉంటాయని, వచ్చే విద్యాసంవత్సరం నుంచి రెండు టర్మ్‌ల పరీక్షా విధానాన్ని అమలు చేస్తామని వివరించింది. 2025 బోర్డు పరీక్షలకు డేట్ షీట్‌ను నవంబర్ నెలాఖరులో విడుదల చేసే అవకాశముంది. అధికారిక వెబ్ సైట్‌ cbse.nic.inలో వాటిని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

Read More...

JEE-Advanced-2025: ఐఐటీల్లో చదువుకోవాలనుకునే వారికి బిగ్ షాక్.. జేఈఈ-అడ్వాన్స్‌డ్ పరీక్షపై యూ టర్న్..!


Advertisement

Next Story