Personal Skills : ప్రతీ విషయంలో పాజిటివిటీ..! స్వీయ సామర్థ్యాన్ని దెబ్బతీయవచ్చు?

by Javid Pasha |
Personal Skills : ప్రతీ విషయంలో పాజిటివిటీ..! స్వీయ సామర్థ్యాన్ని దెబ్బతీయవచ్చు?
X

దిశ, ఫీచర్స్ : జీవితంలో సంతోషంగా ఉండాలంటే ఆలోచనల్లో, ఆచరణలో పాజిటివిటీ ఉండాల్సిందే. పైగా దీనికి చాలా పవర్ ఉంటుంది. ప్రతీ విషయంలోనూ, ప్రతీ సందర్భంలోనూ దానిపైనే ఆధారపడటం కూడా మంచిది కాదంటున్నారు నిపుణులు. ఆహారం ఆరోగ్యానికి అవసరమే కానీ, అతిగా తింటే రిస్క్ పెరిగినట్లు, అతి సానుకూల ధోరణి కూడా కొన్ని సందర్భాల్లో నష్టాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితులను, భావోద్వేగాలను ఎదుర్కొనే ఆత్మస్థైర్యాన్ని, ఆత్మ విశ్వాసాన్ని దెబ్బతీస్తుంది. దీనినే టాక్సిక పాజిటివిటీ అంటున్నారు నిపుణులు.

పాజిటివ్ థింకింగ్ అవసరం కావచ్చు. కానీ అదొక్కటి మాత్రమే అన్ని సందర్భాల్లో ముఖ్యం కాదు. దానికి సామాజిక మద్దతు, స్వీయ సమర్థత, తట్టుకునే సామర్థ్యం వంటి అంశాలు తోడైతేనే మానవ శ్రేయస్సుకు ఉపయోగపడుతుంది. లేకపోతే టాక్సిక్ పాజివిటీగా మారుతుంది. ఉదాహరణకు ఒక వ్యక్తి ఏదో ఒక విషయంలో వెనుక బడినప్పుడు ఎదిగే మార్గం చూపాలి. స్వీయ అనుభవం ద్వారా నేర్చుకునేలా, వాస్తవాలు గుర్తించేలా ప్రోత్సహించాలి. అంతేగానీ అతనికి రాదు కాబట్టి మనమే ఆ వ్యక్తి విషయంలో సర్వస్వం అనుకొని సహాయం చేయడం, ప్రతిదానికీ నీకు నేనున్నాను అని భరోసా ఇవ్వడం అవతలి వ్యక్తిని బలహీన పరుస్తుందని నిపుణులు అంటున్నారు. దటీజ్ టాక్సిక్ పాజిటివిటీ. సో ఎక్కడ అవసరమో, ఎక్కడ అవసరం లేదో గుర్తించాలి.

పాజిటివిటీ, పర్యవసనాలు

ఒక వ్యక్తి టాక్సిక్ పాజిటివిటీ బిహేవియర్ వల్ల అవతలి వ్యక్తి నష్టపోతారు. ఉదాహరణకు ఏదైనా ఒక కేసులో బాధితుల తరపున అధిక సానుకూల పక్షపాతంతో వ్యవహరించే కొందరు టాక్సిక్ పాజివిటీ ధోరణితో ఉంటున్నారు. వీరు సదరు వ్యక్తికి సపోర్టుగా ఉన్నట్లే అనిపిస్తుంది. కానీ బాధలను అనుభవించేలా మోటివేట్ చేస్తుంటారు. దీంతో బాధితులు స్వయంగా సమస్యను ఎదుర్కోకుండా అడ్డుపడుతుంటారు. ఇలా.. ప్రతికూల విషయాలను, భావోద్వేగాలను ప్రదర్శించ కూడదనే ఒత్తిడికి గురయ్యే వారు ఇతరుల సహాయం కోరేందుకు ఇష్టపడకపోవడంవల్ల నష్టపోతారు. అంటే ఇక్కడ అతి సానకూలత కూడా బలహీనతకు కారణం అవుతుంది. ఇది వారిలో తక్కువ ఆత్మగౌరవానికి దారితీస్తుంది. కాబట్టి టాక్సిక్ పాజిటివిటీని నివారించాలంటున్నారు నిపుణులు.

Advertisement

Next Story