- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
KCR: అందుకే ఈ ఈవెంట్‌కు వచ్చాను.. ‘KCR’ ప్రీ రిలీజ్ వేడుకలో ఎమ్మెల్యే హరీష్ రావు
దిశ, సినిమా: రాకింగ్ రాకేష్ (Rocking Rakesh) మెయిన్ లీడ్‌లో నటిస్తున్న తాజా చిత్రం ‘కేశవ చంద్ర రమావత్’ (KCR). గ్రీన్ ట్రీ ప్రొడక్షన్స్ (Green Tree Productions) నిర్మిస్తున్న ఈ మూవీకి గరుడవేగ అంజి (Gardavega Anji) దర్శకత్వం వహించగా.. అన్నన్య కృష్ణన్ హీరోయిన్‌గా నటిస్తుంది. రాకింగ్ రాకేష్ స్వయంగా నిర్మిస్తున్న ఈ మూవీ టీజర్ (teaser), ట్రైలర్ (Trailer) మంచి బజ్ క్రియేట్ చేశాయి. ‘కేశవ చంద్ర రమావత్’ ఈనెల 22న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా తాజాగా మేకర్స్ గ్రాండ్‌గా ప్రీరిలీజ్ ఈవెంట్ (Prerelease Event)ను నిర్వహించారు.
ఈ ఈవెంట్‌లో ఎమ్మెల్యే హరీష్ రావు (MLA Harish Rao) మాట్లాడుతూ.. ‘ఎక్కడో మారుమూల గ్రామంలో పుట్టి ఒకొక్క మెట్టు ఎదుగుతూ రాకింగ్ రాకేశ్‌గా పేరు తెచ్చుకోవడం చాలా సంతోషం. సినిమాలతో నాకు పెద్ద సంబంధం లేకపోయిన రాకేశ్‌ని ఆశీర్వదించడం కోసం ఈ వేడుకకు వచ్చాను. జబర్దస్త్‌తో తెలుగు ప్రేక్షకులందరి ప్రేమని పొందాడు. రాకేశ్.. కేసీఆర్ గారి స్ఫూర్తితో అద్భుతమైన సినిమా తీయడం చాలా సంతోషం. కేసీఆర్ అంటే ఒక చరిత్ర. రాష్ట్రం సాధించడమే కాదు రాష్ట్రాన్ని పదేళ్ళు అద్భుతమైన ప్రగతి పధంలో నడిపిన నాయకుడు కేసీఆర్. వారి కృషిని పోరాటాన్ని ప్రజలకు చూపించే ప్రయత్నం రాకేశ్ చేశాడు. జనరల్‌గా పవర్‌లో ఉండే పార్టీకి సినిమా తీస్తారు. కానీ అధికారంలో లేకపోయినా సినిమా తీయడం రాకేశ్‌లోని నిజమైన ప్రేమ, ధైర్యం. అందరూ ఈ సినిమా చూసి రాకేశ్‌ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను’ అని చెప్పెకొచ్చారు.
మాజీ మంత్రి రోజా (Former Minister Roja) మాట్లాడుతూ.. ‘రాకేష్ నాకు జబర్దస్త్‌లో పరిచయమయ్యాడు. అప్పటి నుంచి అమ్మ అమ్మ అంటూ చిన్న పిల్లల్లాగా నా చుట్టూ తిరుగుతుంటాడు. నా బిడ్డ రాకేష్ సినిమా సూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నాను. కెసిఆర్ అంటే మా రాకేష్‌కి చాలా ఇష్టం. ఆయన పేరుతో ఈరోజు సినిమా తీయడంతోపాటు తెలంగాణపై తనకున్న ప్రేమని ఈ సినిమాలో చూపిస్తున్నాడు. తెలుగు ప్రేక్షకులంతా ఈ సినిమాని పెద్ద విజయం చేయాలని కోరుకుంటున్నాను. బలగం సినిమాలనే ఈ సినిమా కూడా చాలా ఫ్రెష్‌గా ఉంటుంది. తన సంపాదించిన ప్రతి రూపాయిని ఈ సినిమా కోసం ఖర్చు పెట్టాడు. తన ఇంటిని కూడా త్యాగం చేశాడు. రాకేష్ డ్రీమ్‌ని ఫుల్ ఫిల్ చేస్తూ ఈ సినిమాని పెద్ద సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను’ అన్నారు.
హీరో, ప్రొడ్యూసర్ రాకింగ్ రాకేష్ (Rocking Rakesh) మాట్లాడుతూ.. ‘ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి కారణమైన దీప ఆర్ట్స్ శ్రీనివాస్ గౌడ్‌కి నా జీవితాంతం రుణపడి ఉంటాను. ఈ సినిమాకి ఒక ఉద్యమ నాయకుడు పేరు పెట్టుకున్నాం. నిజంగా నా జీవితంలో ఒక ఉద్యమమే జరిగింది. ఈ సినిమా కోసం నన్ను నమ్మి నా వెంట ఉన్న రాఘవన్నకి రుణపడి ఉంటాను. చదలవాడ శ్రీనివాసరావు ఈ వేడుకకు రావడమే పెద్ద సక్సెస్. రోజా గారికి ధన్యవాదాలు. మీ వేడుకకు వచ్చిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ఈ సినిమా కోసం నాతో నడిచన ప్రతి ఒక్కరిని థాంక్యూ. ఈ ప్రయాణంలో నాకు సపోర్ట్‌గా నిలిచినా నా భార్య సుజాత థాంక్యూ. తప్పకుండా అందరూ సినిమాని థియేటర్స్‌లో చూసి సపోర్ట్ చేయాలి' అని కోరారు
Read More...
Harish Rao: కేసీఆర్ అంటే ఒక చరిత్ర.. కేసీఆర్ ప్రీరిలీజ్ ఈవెంట్ లో హరీష్ రావు