- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Hanmakonda: కేసీఆర్‌కు సీఎం రేవంత్ రెడ్డి సంచలన సవాల్
దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్(BRS)పై సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తే ఊరుకునేది లేదని మండిపడ్డారు. అలాంటి ప్రయత్నాలు చేసిన ఎవరినైనా కటకటాల వెనక్కి పంపిస్తామని అన్నారు. కిరాయి మనుషులతో అడ్డుకోవాలని చూస్తే సహించం అని హెచ్చరించారు. మహిళలకు పెత్తనం ఇవ్వడం కేసీఆర్(KCR)కు ఇష్టం ఉండదని అన్నారు. ప్రజలు పదేళ్లు అధికారం ఇస్తే రాష్ట్రాన్ని తాగుబోతుల సమూహంగా మార్చారని మండిపడ్డారు. ఈ 11 నెలల్లోనే ప్రజలు ఆ పదేళ్లు ఏం కోల్పోయారో తెలుసుకున్నారని అన్నారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉన్నారని.. ఇక కేసీఆర్ ఫామ్‌హౌజ్‌లోనే ఉండాలని సూచించారు. కావాలంటే రోజూ ఫామ్‌హౌజ్‌కు లిక్కర్ తానే పంపిస్తానని సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు.
రుణమాఫీ కానీ రైతులకు కూడా చేసి తీరుతామని.. ఎవరూ ఆందోళన చెందొద్దని సూచించారు. చిన్న చిన్న టెక్నికల్ ఇష్యూస్ ఉంటే సరిచేసుకోవాలని రైతులను కోరారు. తమది ప్రజల ప్రభుత్వమని.. పదేళ్లు పాలించిన నియంత మాదిరి తమ పాలన ఉందదని హామీ ఇచ్చారు. రెండు పర్యాయాలు ప్రజలు అధికారం ఇస్తే రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని అన్నారు. ఇప్పుడు ఆ అప్పులకు వడ్డీలు కట్టేందుకే వేల కోట్లు పోతోందని చెప్పారు. రుణమాఫీపై అసెంబ్లీలో చర్చ పెట్టడానికి కూడా సిద్ధమని.. కేసీఆర్ అసెంబ్లీకి వచ్చినప్పుడే చర్చ పెడదామని అన్నారు. అసెంబ్లీ వచ్చే దమ్ము కేసీఆర్‌కు ఉందా? అని సవాల్ చేశారు. సోనియా గాంధీ లేకపోతే తెలంగాణ వచ్చేది కాదని అన్నారు. ఆమె కాళ్లు కడిగి నెత్తిమీద చల్లుకున్నా తప్పులేదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి సూచించారు.