- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Breaking: లారీ-కారు ఢీ.. ఇద్దరు వృద్ధులు దుర్మరణం

దిశ, వెబ్ డెస్క్: విజయనగరం జిల్లా(Vizianagaram District)లో జరిగిన రోడ్డుప్రమాదం(Road accident)లో తమిళనాడు(Tamil Nadu)కు చెందిన ఇద్దరు వృద్ధులు మృతి చెందగా మరొకరికి గాయాలయ్యాయి. భోగాపురం మండలం లింగాలవలస వద్ద కారు(Car)ను లారీ(Lorry) ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 74 ఏళ్ల సాయిలీల, 85 సంవత్సరాల అశోక్ కుమార్ అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరికి గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తు్న్నారు. మృతుల మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు. లారీ అతివేగమే(Very fast) ప్రమాదానికి కారణంగా అంచనా వేశారు. ఈ ప్రమాదంతో రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో క్లియర్ చేశారు. ప్రమాదాలకు ఎక్కువ శాతం అతిమేగమేనని, డ్రైవర్లు కుటుంబ సభ్యులను దృష్టిలో పెట్టుకుని డ్రైవింగ్ చేయాలని సూచించారు. రోడ్ రూల్స్ పాటించాలని, లేని పక్షంలో చర్యలు తప్పవని హెచ్చరించారు.