Tammareddy Bharadwaj : రెమ్యునరేషన్ల భారం ప్రజలపై వేయడం కరెక్ట్ కాదు

by M.Rajitha |   ( Updated:2024-12-26 13:17:52.0  )
Tammareddy Bharadwaj : రెమ్యునరేషన్ల భారం ప్రజలపై వేయడం కరెక్ట్ కాదు
X

దిశ, వెబ్ డెస్క్ : పుష్పా-2(Pushpa-2), సంధ్య థియేటర్ ఘటనలు(Sandhya Theater Incident), ఆ తర్వాత జరిగిన పరిణామాలు.. నేడు సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)తో సినీ పెద్దలు సమావేశం కావడంపై నిర్మాత, దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ్(Tammareddy Bharadwaj) స్పందించారు. సినిమా వాళ్లను ఫ్యాన్స్ దేవుళ్లుగా చూస్తారన్నారు. ఆప్తులమని చెప్పుకునే వాళ్లు హీరోలకు తప్పుడు డైరెక్షన్స్ ఇస్తున్నారన్నారు. గతంలో చిరంజీవి, బాలయ్య, నాగార్జున వంటి వాళ్లు సింగిల్ గా ఐమ్యాక్స్ కు వెళ్లి సినిమాలు చూసి వెళ్లిపోయేవారని గుర్తు చేశారు. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో మాస్ పబ్లిక్, హడావుడి ఎక్కువ ఉంటుంది. అలాంటి చోట్ల హీరోలు ఫ్యాన్స్ గురించి, ప్రజల శ్రేయస్సు గురించి ఆలోచించలేరా? అని ప్రశ్నించారు. నటులు కలెక్షన్స్ తో కాదు పర్ఫామెన్స్ తో ఇండస్ట్రీకి పేరు తేవాలని సూచించారు. హీరోల రెమ్యూరేషన్ భారం ప్రజలపై వేస్తున్నారని, అది ఎంత వరకు కరెక్ట్ అనేది వారే ఆలోచించుకోవాలని తెలిపారు. ప్రజలకు ఉపయోగపడేలా సినిమాలు ఉండాలని ఈ సందర్భంగా తమ్మారెడ్డి హితవు పలికారు. పుష్పా సినిమాలో మంచి పోలీస్ ఆఫీసర్ విలన్ అయ్యాడని.. దానిని జనంలోకి ఎలా వెళ్తుందో దర్శకులు ఆలోచించాలన్నారు. కమర్షియల్ సినిమాపై కామెంట్స్ చేసే హక్కు లేకపోవచ్చు. కానీ ప్రెస్ మీట్ పెట్టి సినిమా స్థాయి గురించి మాట్లాడకుండా ఉంటే చాలన్నారు.

Advertisement

Next Story

Most Viewed