Allari Naresh: ‘బచ్చల మల్లి’ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించిన అల్లరి నరేష్

by Hamsa |   ( Updated:2024-11-22 12:39:51.0  )
Allari Naresh: ‘బచ్చల మల్లి’ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించిన అల్లరి నరేష్
X

దిశ, సినిమా: టాలీవుడ్ హీరో అల్లరి నరేష్(Allari Naresh) కామెడీ చిత్రాలతో ప్రేక్షకులను అలరించి వారి హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నాడు. వైవిధ్యమైన పాత్రల్లో నటిస్తూ సినీ ప్రియుల్లో ఆసక్తిని పెంచుతున్నాడు. ప్రజెంట్ అల్లరి నరేష్, సుబ్బు మంగాదేవి దర్శకత్వంలో ‘బచ్చల మల్లి’(Bachhala Malli) సినిమా చేస్తున్నాడు. ఇందులో అమృత అయ్యర్ హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే ఈ చిత్రాన్ని హాస్యా మూవీస్ బ్యానర్‌పై రాజేశ్ దండా(Rajesh Danda), బాలాజీ గుత్తా నిర్మిస్తున్నారు.

షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. తాజాగా, ఈ చిత్రం రిలీజ్ డేట్‌ను అల్లరి నరేష్ ప్రకటించాడు. డిసెంబర్ 20న ప్రపంచవ్యాప్తంగా(worldwide) విడుదల కాబోతున్నట్లు ‘X’ ద్వారా వెల్లడించాడు. అలాగే ఓ పోస్టర్‌ను కూడా షేర్ చేస్తూ.. ‘‘ఇది మీ కథ. లేకపోతే మీకు తెలిసిన వారి కథ. బిగ్ స్క్రీన్‌పై వచ్చేందుకు సిద్ధంగా ఉంది’’ అనే క్యాప్షన్ జత చేశాడు.

Advertisement

Next Story

Most Viewed