లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఆర్ఐ

by Aamani |
లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఆర్ఐ
X

దిశ, పెద్దపల్లి : రూ.12వేల లంచం తీసుకుంటూ ఉండగా ఓ అవినీతి రెవిన్యూ అధికారి ఏసీబీ కి రెడ్ హ్యాండెడ్ గా పట్టుపడ్డాడు. వివరాల్లోకి వెళ్తే... గత నెల 27వ తేదీన లింగాపూర్ నుండి అంతర్గంకు ఆలకుంట మహేష్ అనే వ్యక్తి ఇసుక తరలిస్తుండగా అంతర్గం ఎస్ఐ వెంకటస్వామి పట్టుకొని తహసీల్దార్ కార్యాలయానికి తరలించారు. దీనికి రూ. 25 వేల జరిమానా విధించడంతో ఈ నెల 14వ తేదీన మహేష్ జరిమానా కట్టారు. అయితే పట్టుకున్న ట్రాక్టర్ ను రిలీజ్ చేయడానికి ఆర్.ఐ శ్రీధర్ లంచం డిమాండ్ చేసినట్లు సమాచారం. దీంతో ఆర్.ఐ వేధింపులు భరించలేక మహేష్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఈ మేరకు బాధితుడి నుంచి లంచం తీసుకుంటూ ఉండగా ఏసీబీ అధికారులు ఆర్ఐని పట్టుకున్నారు. దీనిపై ఏసీబీ అధికారులు తహసీల్దార్ కార్యాలయంలో విచారణ చేపడుతున్నారు. ప్రస్తుతం లంచం తీసుకున్న ఆర్ ఐ పరారీలో ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

Advertisement

Next Story

Most Viewed