ఓ అభిమాని ఆత్మహత్యాయత్నానికి దారితీసిన 'ఆర్ఆర్ఆర్' ఫ్లెక్సీ

by Vinod kumar |
ఓ అభిమాని ఆత్మహత్యాయత్నానికి దారితీసిన ఆర్ఆర్ఆర్ ఫ్లెక్సీ
X

దిశ, కోదాడ: ప్రపంచ వ్యాప్తంగా ఆర్ఆర్ఆర్ మూవీ విడుదలవుతుంది. దీనిలో భాగంగా కోదాడ పట్టణంలోని శ్రీనివాస థియేటర్ వద్ద ఫ్లెక్సీ కట్టే విషయంలో ఎన్టీఆర్ అభిమానుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. థియేటర్ పై ఫ్లెక్సీ కట్టే సమయంలో మా ఫ్లెక్సీ ముందు కనపడేలా ఉండాలంటూ ఇరువురు గొడవకు దిగారు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ అభిమాని రోడ్డుపై బైఠాయించి ఒంటిపై పెట్రోలు పోసుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. విషయం తెలుసుకున్న పోలీసులు రంగప్రవేశం చేసి ఇరువర్గాలను చెదరగొట్టారు. ఘర్షణకు దిగిన వారిని అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు.

Advertisement

Next Story