- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
రేవంత్ రెడ్డి ఒక బ్రోకర్, 420 .. ఎంపీ బీబీపాటిల్ ఫైర్
దిశ, తెలంగాణ బ్యూరో : రేవంత్ రెడ్డి ఒక బ్రోకర్, 420 అని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజుల సురేందర్, ఎంపీ బీబీ పాటిల్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తెలంగాణ భవన్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ప్రస్టేషన్‌లో ఉందని, ఆ పార్టీ నాయకులు ఏం మాట్లాడుతున్నారో అర్ధం కావడం లేదన్నారు. 8 ఏళ్లలో రాష్ట్రంలో ఎంతో అభివృద్ధి జరిగిందన్నారు. అభివృద్ధిలో దేశంలోనే తెలంగాణ ముందుందని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణలాంటి పథకాలు ఉన్నాయా? అని ప్రశ్నించారు. ఎల్లారెడ్డిలో మన ఊరు మన పోరు పేరు మీదా సభ చూస్తుంటే నవ్వు వస్తుందన్నారు. సభలో ఎల్లారెడ్డి ప్రజలే లేరు, ఒక్క నాయకుడు లేడన్నారు. అంతా కిరాయికి తెచ్చుకున్న నాయకులే ఉన్నారని ఆరోపించారు.
పీసీసీని కొనుక్కున్న దొంగ రేవంత్ అని దుయ్యబట్టారు. తెలంగాణలో ఉన్నా ప్రభుత్వ పరిశ్రమలు మూతపడతానికి కారణం కాంగ్రెస్ కాదా? అని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ ను గురించి మాట్లాడే అర్హత రేవంత్ రెడ్డికి లేదన్నారు. కేసీఆర్ నాయకత్వం కోసం దేశమే చూస్తుందన్నారు. రాష్ట్రంలో ఉన్న సంక్షేమ పథకాలు ఏ రాష్ట్రంలో లేవని, కాంగ్రెస్ పార్టీ పరిపాలిస్తున్న రాష్ట్రంలో ఎక్కడైనా ఉన్నాయా? అన్నారు. ఎల్లారెడ్డి గడ్డ టీఆర్ఎస్ అడ్డ అన్నారు. ఎల్లారెడ్డి నియోజవర్గంలో 2వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. 40 సంవత్సరాలు లేని అభివృద్ధి కేసీఆర్ నాయకత్వంలో జరుగుతుందన్నారు. సమావేశంలో డీసీసీబీ చైర్మన్ భాస్కర్ రెడ్డి, కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు ముజీబుద్దిన్, జిల్లా చైర్ పర్సన్ శోభా దఫెదార్ రాజు, మాజీ మంత్రి , సీనియర్ నాయకుడు నేరళ్ల ఆంజనేయులు పాల్గొన్నారు.