Men and secrets : సీక్రెట్స్.. పురుషులు బయటకు కనిపించకుండా కవర్ చేసే విషయాలివే.. !

by Javid Pasha |
Men and secrets : సీక్రెట్స్.. పురుషులు బయటకు కనిపించకుండా కవర్ చేసే విషయాలివే.. !
X

దిశ, ఫీచర్స్ : ‘‘ఫలానా వ్యక్తి మంచోడు ఏదీ ఓ పట్టాన మనసులో దాచుకోడు.. మా ఆయన అలాంటి వాడు కాదు. నావద్ద ఏ విషయాన్నీ దాచడు. రహస్యాలన్నీ చెప్పేస్తుంటాడు. మా బాబు వెరీ గుడ్ బాయ్ ప్రతిదీ షేర్ చేసుకుంటాడు’’ అప్పుడప్పుడైనా ఇలాంటి మాటలు మనం వింటుంటాం. కొందరి విషయంలోనో, కొన్ని సందర్భాల్లోనో అవి నిజం కూడా కావచ్చు. కానీ అందరి విషయంలోనూ, అన్ని సందర్భాల్లోనూ అదే నిజమని అనుకోవడం మాత్రం పొరపాటే అంటున్నారు నిపుణులు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఏదో ఒక విషయంలో రహస్యాలు దాచే అవకాశం ఉంది. అయితే పురుషులు బయటకు కనబడకుండా దాచే కొన్ని సీక్రెట్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

టెన్షన్‌లో ఉన్నప్పుడు

స్ట్రెస్, యాంగ్జైటీ, టెన్షన్ వంటివి ఎదుర్కొంటున్నప్పటికీ పురుషులు చాలా వరకు వాటిని బయటకు కనబడకుండా కవర్ చేయడానికి ప్రయత్నిస్తారు. ముఖ్యంగా అలాంటి సందర్భాలను ఎదుర్కొన్నప్పుడు భార్య లేదా ప్రియురాలి ముందు వాటిని ప్రదర్శించరు. అట్లనే కుటుంబ పోషణ, పిల్లల చదువులు, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పుడు పురుషులు ఒత్తిడికి గురవుతుంటారు. కానీ భార్యముందు మాత్రం అదేం పెద్ద సమస్యే కాదు అన్నట్లు ప్రవర్తిస్తుంటారు. తాము స్ట్రెస్ ఎదుర్కొంటున్న విషయాన్ని దాదాపు సీక్రెట్‌గా ఉంచుతారు.

దుఃఖం వచ్చినా బోరున ఏడ్వలేరు

మహిళలు బాధ అనిపించినా, భావోద్వేగానికి లోనైనా త్వరగా బయటపడతారు. మనసులో బాధగా అనిపించినా భర్తతో, సన్నిహితులతో చెప్పుకొని బోరున ఏడ్చేస్తారు. తమ కష్టాలు చెప్పుకొని కన్నీళ్లు కారుస్తారు. కానీ పురుషులు చాలా వరకు అలా చేయరు. తన భార్య ముందు అయినా సరే భర్త తీవ్రమైన బాధను వ్యక్తం చేస్తూ కన్నీళ్లు పెట్టుకోవడం చాలా అరుదు. మనసులో బాధగా ఉన్నా పైకీ గంభీరంగా బిహేవ్ చేస్తుంటారు. కానీ ఎవరూ లేనప్పుడు తమలో తాము చాలా బాధ పడతారు. అవసరమైతే ఏడుస్తారు. ఆడవాళ్ల ముందు ఏడుస్తావేంటి అని ఎవరైనా ఎగతాళి చేస్తారేమోననే ఉద్దేశంతో కూడా చాలామంది పురుషులు మహిళల ముందు తమ బాధలను, రహస్యాలను చెప్పుకోరు. వారి ముందు కన్నీరు పెట్టుకోరు.

ఆన్‌లైన్‌‌లో ఏం చేస్తారో?

ప్రస్తుతం ప్రతి ఒక్కరూ ఏదో ఒక కారణంతో ఆన్‌లైన్‌లో గడుపుతుంటారు. మహిళలు సోషల్ మీడియాలో తాము పంచుకున్న విషయాలను తమ క్లోజ్ ఫ్రెండ్స్‌తో, భర్తతో చెబుతుంటారు. కానీ పురుషులు అందులో తాము ఏం చేస్తున్నది, తాము ఎవరిని ఫాలో అవుతున్నది, తమను ఎవరు ఫాలో అవుతున్నది తదితర విషయాలను భార్యతో పంచుకోవడానికి అస్సలు ఇష్టపడరట. అయితే అమ్మాయిలు మాత్రం తమ బాయ్ ఫ్రెండ్ సోషల్ మీడియా అకౌంట్లను, మహిళలు తమ భర్త సోషల్ మీడియా స్టేటస్‌లను వారికి తెలియకుండానే చెక్ చేస్తుంటారని, తెలిసి కూడా చెక్ చేస్తుంటారని చెప్తారు.

అట్రాక్ట్ అయినప్పుడు

మా ఫ్రెండ్ లేదా మా ఆయన మహిళలవైపు కనీసం కన్నెత్తి కూడా చూడడు అంటుంటారు కొందరు. కానీ ఇది చాలా వరకు అబద్దం అంటారు మానసిక నిపుణులు. పెళ్లి అయినా, కాకున్నా బయట తిరుగుతున్నప్పుడు, ఆయా సందర్భాల్లో అమ్మాయిలు కనిపించినప్పుడు పురుషులు వారికి అట్రాక్ట్ అయిపోయి వారివైపు చూస్తుంటారు. అలాగని ప్రతీ చూపులో చెడు ఉద్దేశం ఉంటుందని కాదు. కాకపోతే ఇతర మహిళలపట్ల పురుషులకు ఆకర్షణ సహజంగానే ఉంటుందని నిపుణులు చెప్తున్నారు.

Advertisement

Next Story