Renu Desai: ఎట్టకేలకు గుడ్ న్యూస్ ప్రకటించిన రేణు దేశాయ్.. ఆశ్చర్యపోతున్న ఫ్యాన్స్

by Hamsa |   ( Updated:2024-10-14 14:29:59.0  )
Renu Desai: ఎట్టకేలకు గుడ్ న్యూస్ ప్రకటించిన రేణు దేశాయ్.. ఆశ్చర్యపోతున్న ఫ్యాన్స్
X

దిశ, సినిమా: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan)మాజీ భార్య రేణు దేశాయ్(Renu Desai) గత కొద్ది కాలంగా సినిమాలకు దూరంగా ఉంటుంది.పవన్‌తో విడాకులు తీసుకున్నప్పటికీ నుంచీ పిల్లలు ఆద్య, అకీరా నందన్(Akira Nandan) బాధ్యత తీసుకుని ఇంట్లోనే ఉంటుంది. ఇక అప్పటినుంచి సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ జంతువులకు సాయం చేస్తోంది. అంతేకాకుండా ఫాలోవర్స్‌ను కూడా విరాళాలు అడిగి మరీ జంతువులపై దాడి జరగకుండా అవి సురక్షితంగా ఉండేలా చేస్తుంది.

అలాగే పలు విషయాలపై రియాక్ట్ అవుతూనే పవన్ ఫ్యాన్స్ ఏదైనా అంటే స్ట్రాంగ్ కౌంటర్లు వేస్తోంది. తాజాగా, రేణు దేశాయ్ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఓ గుడ్ న్యూస్ ప్రకటించింది. ‘‘షూటింగ్‌లో పాల్గొనడం కోసం. ఏడాది తర్వాత మళ్లీ మేకప్ వేసుకుంటున్నాను’’ అని రాసుకొచ్చింది. కానీ ఏ సినిమా కోసమో వెల్లడించలేదు. ఇక ఈ విషయం తెలుసుకున్న ఫ్యాన్స్ కొందరు ఆశ్చర్యపోతుంటే.. మరికొందరు మాత్రం ఆనందపడుతున్నారు.

Next Story

Most Viewed