Telangana: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఇంటర్వ్యూలు లేకుండానే ఆ ఉద్యోగాల భర్తీ..?

by Satheesh |   ( Updated:2022-04-06 10:59:40.0  )
Telangana: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఇంటర్వ్యూలు లేకుండానే ఆ ఉద్యోగాల భర్తీ..?
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 80 వేల ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. దీనితో సంబంధిత శాఖ అధికారులు నోటిఫికేషన్లపై కసరత్తులు ప్రారంభించారు. మొదట గ్రూప్ 1, గ్రూప్ 2 ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇవ్వనున్నట్లు సమాచారం. అయితే గ్రూప్ 1, గ్రూప్ 2 ఎంపిక విధానంలో కీలక మార్పులు చేయాలని అధికారులు ఆలోచిస్తున్నారు. గ్రూప్ 1, గ్రూప్‌ 2 ఉద్యోగాల ఎంపికలో భాగమైన ఇంటర్వ్యూ ప్రాసెస్‌ లేకుండానే ఆ ఉద్యోగాలను భర్తీ చేసేలా అధికారులు కసరత్తులు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఫైల్‌ను సీఎం ఆమోదం కోసం పంపించారు.

ప్రస్తుతం గ్రూప్ 1 ఇంటర్వ్యూకు 100మార్కులు ఉండగా.. గ్రూప్‌ 2లో ఇంటర్వ్యూ్కి 75 మార్కులు ఉన్నాయి. టీఎస్పీఎస్సీ భర్తీ చేసే వాటిల్లో ఇప్పటి వరకు గ్రూప్1, గ్రూప్ 2 పరీక్షలకు మాత్రమే ఇంటర్వ్యూ ఉండగా.. సీఎం ఆ ఫైల్‌ను ఆమోదిస్తే ఇకపై వీటికి కూడా ఇంటర్వ్యూలు లేకుండానే భర్తీ జరగనుంది.

Advertisement

Next Story