RBI Payments Vision 2025: 'పేమెంట్స్ విజన్ 2025' ని విడుదల చేసిన RBI

by Harish |   ( Updated:2022-06-18 08:31:09.0  )
RBI Unveils Payments Vision 2025 with an aim to enhance e-payments
X

ముంబై: RBI Unveils Payments Vision 2025 with an aim to enhance e-payments| రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) సురక్షితమైన చెల్లింపుల కోసం 'పేమెంట్స్ విజన్ 2025' డాక్యుమెంట్‌ను ఆవిష్కరించింది. దేశంలోని చెల్లింపు వ్యవస్థల నియంత్రణకు సంబంధించిన ముఖ్యమైన వ్యూహాత్మక లక్ష్యాలను దీనిలో వివరించారు. చెల్లింపుల విజన్ 2025 'ప్రతి ఒక్కరికి, ప్రతి చోట, ప్రతిసారీ, ( 'E-Payments for Everyone, Everywhere, Everytime' (4Es)) ఇ-చెల్లింపుల కోసం' అనే ప్రధాన థీమ్‌ను కలిగి ఉంది. గత దశాబ్ద కాలంలో చెల్లింపులు అనేక రకాలుగా విస్తరించాయి. భారతదేశం ప్రపంచంలోనే అత్యంత ఆధునిక డిజిటల్ చెల్లింపు వ్యవస్థలను కలిగి ఉంది. భద్రతా చర్యల కోసం నిర్ణయాత్మక పర్యవేక్షణ, మార్గదర్శకాలను ప్రణాళికాబద్దంగా ఈ బ్లూప్రింట్‌లో వివరించారు. వివిధ వాటాదారుల నుండి ఇన్‌పుట్‌లు, ఆర్‌బిఐ చెల్లింపులు, సెటిల్‌మెంట్ సిస్టమ్‌ల నియంత్రణ, పర్యవేక్షణ కోసం బోర్డు నుండి వచ్చిన మార్గదర్శకాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత చెల్లింపుల విజన్ 2025 సిద్ధం చేసినట్లు RBI తెలిపింది.

విజన్ 2025 లో భాగంగా 2025 వరకు చేపట్టాల్సిన కార్యకలాపాలు.. సమగ్రత, చేరిక, ఆవిష్కరణ, సంస్థాగతీకరణ, అంతర్జాతీయీకరణ. "ఈ చర్యలు చెల్లింపు వ్యవస్థలను మరింత ముందుకు తీసుకువెళతాయని, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలలో సామర్థ్యాన్ని పెంచగలదని భావిస్తున్నట్లు" RBI తెలిపింది. ఖర్చు, వేగం, యాక్సెస్, పారదర్శకత అనే నాలుగు ప్రధాన సవాళ్లు పరిష్కరించడం ద్వారా డిజిటల్ చెల్లింపులు విస్తరిస్తాయని, ఫైనాన్షియల్ సర్వీసెస్ స్పేస్‌లో డిజిటల్ చెల్లింపు వ్యవస్థ అభివృద్ధి చెందడానికి మరిన్ని కార్యక్రమాలు తీసుకురావాలని RBI తెలిపింది. నగదు రహిత రిటైల్ చెల్లింపులలో డిజిటల్ లావాదేవీల వాటా 2021-22 లో 99.3శాతం పెరిగింది. ఇది అంతకుముందు సంవత్సరంలో 98.8 శాతంగా ఉంది.

Advertisement

Next Story

Most Viewed